కోహ్లిలా దూకుడుగా ఉండటం మా విధానం కాదు! | India vs England Ben Stokes Comments On Virat Kohli Body Language | Sakshi
Sakshi News home page

విరాట్‌ పరుగులు చేయకుండా ఉండాలి.. అప్పుడే!

Mar 25 2021 8:33 PM | Updated on Mar 26 2021 12:32 AM

India vs England Ben Stokes Comments On Virat Kohli Body Language - Sakshi

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి- బెన్‌స్టోక్స్‌(కర్టెసీ: ఏఎఫ్‌పీ)

ప్రతీ జట్టుకు, ప్రతీ ఆటగాడికి తమదైన ఆటిట్యూడ్‌ ఉంటుంది. అదే వారి విజయసూత్రంగా మారుతుంది.

పుణె: దూకుడుగా వ్యహహరించడం భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అతడి జట్టుకు వర్కౌట్‌ అవుతుందేమోగానీ తమకు మాత్రం కాదని ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అన్నాడు. ఒక్కో జట్టుది ఒక్కో శైలి అని, ఇతరులు సత్ఫలితాలు పొందుతున్నారు, కాబట్టి వారిని చూసి తమ ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. కాగా పుణె వేదికగా మార్చి 23న జరిగన తొలి వన్డేలో ఇంగ్లండ్‌, భారత్‌ చేతిలో 66 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. టీమిండియా విధించిన 318 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలుత ఆధిక్యం కనబరిచినా, ఆతిథ్య జట్టు బౌలర్లు విజృంభించడంతో ప్రపంచ చాంపియన్‌ తలవంచక తప్పలేదు. 

ఈ క్రమంలో మార్చి 26(శుక్రవారం) నాటి రెండో వన్డేలో గెలిచి ఎలాగైనా పట్టు సాధించాలని మోర్గాన్‌ బృందం భావిస్తుండగా, సిరీస్‌ను కైవసం చేసుకునే దిశగా కోహ్లి సేన సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు బెన్‌స్టోక్స్‌ విలేకరుల ప్రశ్నలకు బదులిస్తూ... ‘‘ప్రతీ జట్టుకు, ప్రతీ ఆటగాడికి తమదైన ఆటిట్యూడ్‌ ఉంటుంది. అదే వారి విజయసూత్రంగా మారుతుంది. దూకుడుగా ఉండటం ఒక్కటే సత్పలితాలను ఇవ్వదు. గత నాలుగైదేళ్లుగా మా జట్టుకు ఇలాంటి వైఖరి వర్కౌట్‌ కాలేదు. అత్యుత్తమంగా రాణించేందుకు శాయశక్తులు ఒడ్డుతాం. ముందు చెప్పినట్లుగానే ప్రతీ జట్టుకు తనదైన విధానం ఉంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. 

ఇక మైదానంలో ప్రశాంతమైన కోహ్లిని చూడాలనుకుంటున్నారా లేదా కోపంగా ఉండే కోహ్లిని చూడాలనుకుంటున్నారా అని ప్రశ్నించగా, ‘‘నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే, విరాట్‌ పరుగులు చేయకుండా ఉండాలి. ఎందుకంటే అది మాకు మంచిది కాదు కాబట్టి’’ అంటూ తెలివిగా సమాధానమిచ్చాడు. అదే విధంగా, అగ్రస్థానాన్ని నిలబెట్టుకునే అంశం గురించి బెన్‌స్టోక్స్‌ మాట్లాడుతూ.. ‘‘నంబర్‌ 1గా ఉండే అర్హత మా జట్టుకు ఉంది. మేం ఆడిన తీరే మమ్మల్ని ఆ స్థానానికి తీసుకువెళ్లింది. అయితే, ర్యాంకులే ప్రధానం కాదు, ఆటపై దృష్టి సారిస్తే నంబర్లు వాటంతటవే మారతాయి. కాబట్టి మా ఫోకస్‌ అంతా మ్యాచ్‌పైనే ఉంటుంది’’ అని చెప్పుకొచ్చాడు.

చదవండి: ‌టీ20 వరల్డ్‌కప్‌‌ ఆడే అర్హత వారిద్దరికి ఉంది: లక్ష్మణ్
గబ్బర్‌ను ఊరిస్తున్న మరో రికార్డు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement