సిక్సర్‌తో మొదలుపెట్టి.. 28 బంతుల్లోనే

India Vs England 4th T20 Suryakumar Maiden Half Century - Sakshi

సూర్యకుమార్ యాదవ్‌‌ అర్ధ సెంచరీ

అహ్మదాబాద్‌: ఎట్టకేలకు సూర్యకుమార్‌ యాదవ్‌ కల నెరవేరింది. టీమిండియా తరఫున ఆడాలన్న అతడి నిరీక్షణకు తెరపడి, ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ ముంబై బ్యాట్స్‌మెన్‌ క్రీజులోకి వచ్చీ రాగానే సిక్సర్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల ఖాతా తెరిచాడు. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో మంచి షాట్‌ ఆడి ఇన్నింగ్స్‌ ఘనంగా ఆరంభించాడు. 28 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు.

కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌.. రెండో టీ20 ద్వారా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్‌లో కెప్టెన్‌ కోహ్లి, మరో అరంగేట్ర ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో సూర్యకుమార్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు.

ఇక మంగళవారం నాటి మూడో టీ20లో తుది జట్టులో అతడికి చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నాలుగో మ్యాచ్‌లో తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న సూర్యకుమార్‌.. తొలి మ్యాచ్‌లోనే అర్ధ శతకం బాదిన ఐదో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 6 బౌండరీలు, 3 సిక్సర్లు బాదిన సూర్య.. మొత్తంగా 31 బంతుల్లో 57 పరుగులు చేసి సామ్‌ కర్రన్‌ బౌలింగ్‌లో అంపైర్‌ వివాదాస్పద నిర్ణయానికి బలైపోయి పెవిలియన్‌ చేరాడు.
చదవండి: రోహిత్‌ శర్మ రికార్డు.. భారత రెండో క్రికెటర్‌గా
ఏంది రెడ్డి.. ఏకంగా ధోని వికెట్‌నే లేపేసావు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top