ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడలకు వేర్వేరు భారత జట్లను ఇవాళ (జూన్ 6) ప్రకటించారు. ఈ మూడు జట్లకు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు. ఇప్పటివరకు భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కు సెలెక్టర్లు ఉద్వాసన పలికారు.
అందరూ ఊహించిన విధంగానే చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. వైభవ్‌కు మూడు జట్లలో చోటు దక్కింది.
తెలుగు ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ కూడా మూడు జట్లలో చోటు దక్కించుకున్నారు. తిలక్‌కు జాక్‌పాట్ కూడా తగిలింది. ఆసియా క్రీడల్లో అతడు శ్రేయస్ డిప్యూటీగా ఎంపికయ్యాడు.
ఇదే సందర్భంగా జూన్ 25 నుంచి శ్రీలంకలో పర్యటించాల్సిన భారత్-ఏ జట్టును కూడా ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ధృవ్ జురెల్ ఎంపికయ్యాడు. అతడికి డిప్యూటీగా దేవదత్ పడిక్కల్ నియమించబడ్డాడు. ఈ జట్టులో సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, అన్షుల్ కంబోజ్ లాంటి ఐపీఎల్ స్టార్లు చోటు దక్కించుకున్నారు.
శ్రీలంకలో జరిగే మల్టీ-డే గేమ్‌ల కోసం భారత-ఏ జట్టు: ధృవ్ జురెల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, ఆయుష్ బదోని, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సరాన్ష్ జైన్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, ఎన్ జగదీశన్, అమన్ మోఖడే, షేక్ రషీద్, జీషన్ అన్సారీ
ఇండియా-ఏ టూర్ ఆఫ్ శ్రీలంక షెడ్యూల్
జూన్ 25- తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ (గాలే)
జులై 2- రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ (గాలే)


