Asia Cup 2022: భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. టికెట్స్‌ అమ్మకాలు ఎప్పటి నుంచి అంటే..?

India Pakistan match tickets to go on sale on Monday - Sakshi

అభిమానుల ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఆసియాకప్‌లో భాగంగా భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న దుబాయ్‌ వేదికగా దాయాది దేశం పాకిస్తాన్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్స్‌ ఆగస్టు 15 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆదివారం వెల్లడించింది. ఈ మెరకు.."ఆసియా కప్ టికెట్‌ విక్రయాలు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నాయి.

టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి సోమవారం నుంచి platinumlistను సందర్శించండి" అని ట్విటర్‌లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ పేర్కొం‍ది. ఇక ఆసియాకప్‌-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి దుబాయ్‌ వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌-శ్రీలంక తలపడనున్నాయి. ఇక ఈ టోర్నీలో మెత్తం ఆరు జట్లు పాల్గోనున్నాయి. ఇప్పటికే భారత్‌,పాకిస్తాన్‌, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్‌, బంగ్లాదేశ్‌ అర్హత సాధించగా.. ఇక మరో స్థానం కోసం క్వాలిఫియంగ్‌ రౌండ్‌లో యూఏఈ, కువైట్, సింగపూర్, హాంకాంగ్ తలపడనున్నాయి. అదే విధంగా ఈ టోర్నీ కోసం ఇప్పటికే భారత్‌,పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ తమ జట్లను ప్రకటించాయి.

ఆసియా కప్‌కు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్‌ సింగ్, అవేష్ ఖాన్

ఆసియా కప్‌కు పాక్‌ జట్టు
బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, షాహనావాజ్ ఆఫ్రిది దహానీ  ఉస్మాన్ ఖదీర్
చదవండి: Dawid Malan: సెంచరీ మిస్‌ అయినా 9 సిక్సర్లతో వీరవిహారం..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top