ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ టోర్నీకి జ్యోతి | India names 25-member team for Asian Indoor Athletics Championships | Sakshi
Sakshi News home page

ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ టోర్నీకి జ్యోతి

Feb 7 2023 4:35 AM | Updated on Feb 7 2023 4:35 AM

India names 25-member team for Asian Indoor Athletics Championships - Sakshi

ఈనెల 10 నుంచి 12 వరకు కజకిస్తాన్‌ రాజధాని అస్తానాలో జరిగే ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 25 మందితో కూడిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టార్‌ స్ప్రింటర్‌ జ్యోతి యర్రాజీకి చోటు లభించింది.

విశాఖపట్టణానికి చెందిన జ్యోతి 60 మీటర్లు, 60 మీటర్ల హర్డిల్స్‌ ఈవెంట్స్‌లో పోటీపడుతుంది. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన మిరామస్‌ ఎలైట్‌ ఇండోర్‌ ట్రాక్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో జ్యోతి 60 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకం సాధించింది.  

Advertisement
 
Advertisement
Advertisement