IND vs WI: Rohit Sharma to Fit for Series Hardik Pandya Likely to Back Report - Sakshi
Sakshi News home page

Ind Vs Wi: వెస్టిండీస్‌తో సిరీస్‌కు రోహిత్‌ శర్మ ఫిట్‌.. బుమ్రాకు రెస్ట్‌.. హార్దిక్‌ పాండ్యా రీ ఎంట్రీ!

Jan 26 2022 8:37 AM | Updated on Jan 26 2022 1:40 PM

Ind Vs WI: Rohit Sharma To Fit For Series Hardik Pandya Likely To Back Report - Sakshi

Ind Vs Wi: వెస్టిండీస్‌తో సిరీస్‌కు రోహిత్‌ శర్మ ఫిట్‌.. బుమ్రాకు రెస్ట్‌.. హార్దిక్‌ పాండ్యా రీ ఎంట్రీ!

గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన భారత వన్డే, టి20 కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పూర్తిగా కోలుకున్నాడు. ఫిట్‌గా మారిన అతను వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్‌లలో బరిలోకి దిగడం ఖాయమైంది. ‘త్వరలోనే బెంగళూరులో ఫిట్‌నెస్‌ టెస్టుకు హాజరైన తర్వాత జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) అతడికి ‘మ్యాచ్‌ ఫిట్‌’ అనుమతినిస్తుంది’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 

హార్దిక్‌ పాండ్యా రీ ఎంట్రీ...
ఇక టీ20 ప్రపంచకప్‌ టోర్నీ-2021లో పేలవ ప్రదర్శనకు తోడు... ఫిట్‌నెస్‌ సమస్యలతో జట్టుకు దూరమైన టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా వెస్టిండీస్‌తో సిరీస్‌తో పునరాగమనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెట్స్‌లో బౌలింగ్‌ ప్రాక్టీసు చేస్తున్న అతడు రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. హార్దిక్‌ స్థానాన్ని భర్తీ చేస్తాడునుకున్న యువ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ సౌతాఫ్రికా సిరీస్‌లో పూర్తిగా తేలిపోవడంతో సీనియర్‌కు మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: అదే నా ప్లాన్‌.. ఆల్‌రౌండర్‌గానే... పెద్దగా హడావుడి లేదు.. కెప్టెన్‌గా నా పాలసీ అదే: హార్దిక్‌ పాండ్యా

ఈ మేరకు.. ‘‘టీ20 ప్రపంచకప్‌ టోర్నీ తర్వాత హార్దిక్‌కు విశ్రాంతి ఇవ్వలేదు. తనను జట్టు నుంచి తప్పించారు. వైఫల్యం కారణంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న వాస్తవాన్ని అతడికి తెలియజేసేందుకే సెలక్టర్లు ఇలా చేశారు. నిజానికి తను మంచి ఆటగాడు. పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే తప్పక రాణిస్తాడు. వెస్టిండీస్‌తో లేదంటే... శ్రీలంకతో సిరీస్‌తో అతడు పునరాగమనం చేయడం తథ్యం’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు జాతీయ మీడియాతో పేర్కొన్నాయి. ఇక సీనియర్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విండీస్‌తో సిరీస్‌లో భాగంగా విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.

చదవండి: IND Vs WI: విండీస్‌తో సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement