IND vs WI: ‘అతడిని అడ్డుకున్నాడు.. ఆ పాపం కెప్టెన్‌దే’ | IND vs WI 3rd T20I He stopped him: Ex IND Star Slams Shai Hope captaincy | Sakshi
Sakshi News home page

IND vs WI: ‘అతడిని అడ్డుకున్నాడు.. ఆ పాపం కెప్టెన్‌దే’

Oct 12 2026 11:47 AM | Updated on Oct 12 2026 12:14 PM

IND vs WI 3rd T20I He stopped him: Ex IND Star Slams Shai Hope captaincy

PC: WI Cricket X

టీమిండియాతో మూడో టీ20లో వెస్టిండీస్‌ పద్నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత్‌ సమిష్టి కృషితో గెలుపొందగా.. విండీస్‌ మాత్రం తొలుత బౌలింగ్‌లో.. తర్వాత బ్యాటింగ్‌లో విఫలమై పరాజయాన్ని మూటగట్టుకుంది.

కెప్టెన్సీ తప్పిదాల వల్లే 
ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌ కెప్టెన్‌ షాయీ హోప్‌ తీరును టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా విమర్శించాడు. హోప్‌ కెప్టెన్సీ తప్పిదాల వల్లే భారత్‌ గెలుపు మరింత సులువుగా మారిందని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ..

అతడిని అడ్డుకున్నాడు
‘‘టీమిండియా రెండో ఓవర్లో షమార్‌ జోసెఫ్‌ను హోప్‌ బరిలోకి దించాడు. షమార్‌ ఆ ఓవర్లో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి సంజూ శాంసన్‌ (3) రూపంలో కీలక వికెట్‌ పడగొట్టాడు. గంటలకు 150కి పైగా కిలోమీటర్ల వేగంతో అతడు బౌలింగ్‌ చేస్తున్నాడు.

కానీ సమయంలో అకస్మాత్తుగా హోప్‌ షమార్‌ను ఆపేశాడు. మరుసటి ఓవర్‌లోనూ షమార్‌కు బంతి ఇవ్వాల్సింది. కానీ హోప్‌.. రోస్టన్‌ ఛేజ్‌ను తీసుకురాగా.. అతడు ఏకంగా 18 పరుగులు (1,1,4,6,0,6) సమర్పించుకున్నాడు. అతడి బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మ చితక్కొట్టాడు.

ఆ పాపం కెప్టెన్‌దే
మ్యాచ్‌లో ఇదే కీలక మలుపు. ఇది పూర్తిగా హోప్‌ తప్పిదమే. ఒక రకంగా అతడు చేసిన పాపం ఇది’’ అని ఆకాశ్‌ చోప్రా ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ చేతిలో విండీస్‌ పద్నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

బౌలర్ల ప్రదర్శన ఇలా
టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ తొలుత బౌలింగ్‌ చేయగా.. భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. కరేబియన్‌ బౌలర్లలో రోస్టన్‌ ఛేజ్‌ 38 పరుగులు ఇచ్చి రెండు, షమార్‌ జోసెఫ్‌ 54 పరుగులు ఇచ్చుకుని రెండు.. షమార్‌ స్ప్రింగర్‌ 50 రన్స్‌ ఇచ్చి రెండు వికెట్లు తీశారు. కీమో పాల్‌, గుడకేశ్‌ మోటి కాస్త పొదుపుగా బౌలింగ్‌ చేసి తలా ఒక వికెట్‌ పడగొట్టారు. 

209 పరుగులకే పరిమితం
ఇక లక్ష్య ఛేదనలో విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 209 పరుగుల వద్దే నిలిచిపోయి.. ఓటమిపాలైంది. ఈ గెలుపుతో టీమిండియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇరుజట్ల మధ్య బుధవారం నాటి నాలుగో టీ20కి హైదరాబాద్‌ వేదిక.

చదవండి: అందుకే ఓడిపోయాము.. క్రెడిట్‌ మొత్తం వాళ్లకే దక్కాలి: విండీస్‌ కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement