IND vs SA 3rd Test Day 3: టార్గెట్‌ 212.. దక్షిణాఫ్రికా 101/2

Ind Vs Sa 3rd Test: Day 3 Updates And Highlights In Telugu - Sakshi

IND vs SA 3rd Test- Day 3 Updates:

9:30 PM: టార్గెట్‌ 212.. దక్షిణాఫ్రికా 101/2
212 పరుగుల ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. మూడో రోజు ఆఖరి బంతికి ఎల్గర్‌(30) ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో పంత్‌ క్యాచ్‌కు ఇచ్చి ఎల్గర్‌ వెనుదిరిగాడు. క్రీజ్‌లో కీగన్‌ పీటర్సన్‌(48) ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలవాలంటే మరో 111 పరుగులు అవసరం కాగా, టీమిండియా 8 వికెట్లు పడగొడితే మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. 

కాగా, టీమిండియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌ 198 పరుగుల వద్ద ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్‌ 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది. రిషబ్‌ పంత్‌ వీరోచిత సెంచరీ(100 నాటౌట్‌)తో జట్టును ఆదుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌(10), కోహ్లి(29), పంత్‌ మినహా ఎవ్వరూ రెండంకెల స్కోర్‌ కూడా చేయలేకపోయారు. సఫారీ బౌలర్లలో జన్సెన్‌ 4, రబాడ, ఎంగిడి తలో 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన విషయం తెలిసిందే.  

7:40 PM: టార్గెట్‌ 212.. తొలి వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. 16 పరుగులు చేసిన మార్క్రమ్‌.. షమీ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 23 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. క్రీజ్‌లో డీన్‌ ఎల్గర్‌(3), పీటర్సన్‌ ఉన్నారు. ఈ మ్యాచ్‌ గెలవాలంటే దక్షిణాఫ్రికాకు మరో 189 పరుగులు, టీమిండియాకైతే 9 వికెట్లు కావాలి. 

ముగిసిన భారత ఇన్నింగ్స్‌.. దక్షిణాఫ్రికా టార్గెట్‌ 212
6: 50 PM: జన్సెన్‌ బౌలింగ్‌లో బవుమాకు క్యాచ్‌ ఇచ్చి బుమ్రా(2) ఔట్‌ కావడంతో టీమిండియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌ 198 పరుగుల వద్ద ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్‌ 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది. రిషబ్‌ పంత్‌ వీరోచిత సెంచరీ(100 నాటౌట్‌)తో జట్టును ఆదుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌(10), కోహ్లి(29), పంత్‌ మినహా ఎవ్వరూ రెండంకెల స్కోర్‌ కూడా చేయలేకపోయారు. సఫారీ బౌలర్లలో జన్సెన్‌ 4, రబాడ, ఎంగిడి తలో 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన విషయం తెలిసిందే.    

6:32 PM: షమీ ఔట్‌.. టీమిండియా తొమ్మిదో వికెట్‌ డౌన్‌
మార్కో జన్సెన్‌ బౌలింగ్‌లో 189 పరుగుల వద్ద మహ్మద్‌ షమీ డకౌటయ్యాడు. ఫలితంగా టీమిండియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 212 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. క్రీజ్‌లో పంత్‌(94), బుమ్రా ఉన్నారు.

6:05 PM: ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. ఉమేశ్‌ డకౌట్‌
టీమిండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 180 పరుగుల వద్ద రబాడ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ వెర్రిన్‌కు సునాయాసమైన క్యాచ్‌ ఇచ్చి ఉమేశ్‌ యాదవ్‌(0) ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 193 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. క్రీజ్‌లో పంత్‌(87), షమీ ఉన్నారు.

5:50 PM: ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
170 పరుగుల స్కోర్‌ వద్ద భారత్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ వెర్రిన్‌కు క్యాచ్‌ ఇచ్చి శార్ధూల్‌ ఠాకూర్‌(5) ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 183 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. క్రీజ్‌లో పంత్‌(77), ఉమేశ్‌ యాదవ్‌ ఉన్నారు. 

5:28 PM: అశ్విన్‌(7) ఔట్‌.. టీమిండియా ఆరో వికెట్‌ డౌన్‌
162 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో జన్సెన్‌కు క్యాచ్‌ ఇచ్చి అశ్విన్‌(7) వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 175 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. క్రీజ్‌లో పంత్‌(74), శార్ధూల్‌ ఠాకూర్‌ ఉన్నారు. 

5:08 PM: ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
లంచ్‌ విరామం తర్వాత టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. నిలకడగా ఆడుతున్న జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(143 బంతుల్లో 29; 4 ఫోర్లు​) లూజ్‌ షాట్‌ ఆడి వికెట్‌ సమర్పించుకున్నాడు. ఎంగిడి బౌలింగ్‌లో మార్క్రమ్‌ సెకెండ్‌ స్లిప్‌లో సునాయాసమైన క్యాచ్‌ అందుకున్నాడు. ఫలితంగా టీమిండియా 152 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. క్రీజ్‌లో పంత్‌(71), అశ్విన్‌ ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 165 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. 

2: 20 PM: నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌
రబడ బౌలింగ్‌లో డీన్‌ ఎల్గర్‌కు క్యాచ్‌ ఇచ్చి అజింక్య రహానే పెవిలియన్‌ చేరాడు. కోహ్లి, పంత్‌ క్రీజులో ఉన్నారు.

2: 07 PM: మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
దక్షిణాఫ్రికాతో మూడో రోజు ఆటలో భాగంగా భారత జట్టు ఆదిలోనే కీలక వికెట్‌ కోల్పోయింది. మార్కో జాన్‌సెన్‌ బౌలింగ్‌లో పుజారా మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. కీగన్‌ పీటర్సన్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. కోహ్లి, రహానే క్రీజులో ఉన్నారు. ప్రస్తుత స్కోరు: 58/3.

2: 00 PM:
దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య ఆఖరి టెస్టులో భాగంగా మూడో రోజు ఆట ఆరంభమైంది. 57/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో భారత్‌ ఆట మొదలుపెట్టింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 14, పుజారా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 223 ఆలౌట్‌
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 210 ఆలౌట్‌

తుది జట్లు:
భారత్‌: కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే, విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌

సౌతాఫ్రికా: డీన్‌ ఎల్గర్‌(కెప్టెన్‌), ఎయిడెన్‌ మార్కరమ్‌, కీగన్‌ పీటర్సన్‌, రసే వాన్‌ డెర్‌ డసెన్‌, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్‌ కీపర్‌), మార్కో జాన్‌సెన్‌, కగిసో రబడ, కేశవ్‌ మహరాజ్‌, డువానే ఒలివర్‌, లుంగి ఎంగిడి.

చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top