Ind Vs Nz Test Series: అందుకే రహానే ఇంకా జట్టులో ఉన్నాడు.. అదృష్టవంతుడు

Ind Vs Nz: Gautam Gambhir On Ajinkya Rahane Pretty Fortunate Still Part Of Side - Sakshi

Ind Vs Nz: Gautam Gambhir On Ajinkya Rahane Pretty Fortunate Still Part Of Side: టీ20 ప్రపంచకప్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి టీమిండియా మాంచి జోరు మీద ఉంది. పొట్టి ఫార్మాట్‌లో అద్భుత విజయాన్ని ఆస్వాదిస్తూనే.. టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. ఇక కాన్పూర్‌ వేదికగా నవంబరు 25- 29 వరకు మొదటి టెస్టు, డిసెంబరు 3- 7 వరకు ముంబై వేదికగా రెండో టెస్టు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్‌కు జట్టును ప్రకటించారు. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో... అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పారు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ రహానే గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫామ్‌లో లేకపోయినప్పటికీ అతడు జట్టులోకి వచ్చాడని.. తనెంతో అదృష్టవంతుడని వ్యాఖ్యానించాడు. కెప్టెన్‌ కాబట్టే తను ఇంకా జట్టులో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ షో ‘‘గేమ్‌ ప్లాన్‌’’లో భాగంగా గౌతీ మాట్లాడుతూ.. టెస్టు సిరీస్‌ సన్నాహాకాలపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌లను ఓపెనర్లుగా పంపితే బాగుంటుంది. అలా అయితే నాలుగో స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌ను పంపాల్సి ఉంటుంది.

ఇక రహానే విషయానికొస్తే.. నిజంగా తను అదృష్టవంతుడు. అవసరమైనపుడు సారథిగా వ్యవహరిస్తున్నందుకే తనకు అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను. అయితే, కనీసం ఈసారైనా తను ఈ ఛాన్స్‌ను చక్కగా వినియోగించుకోవాలని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. ఇక తెలుగు క్రికెటర్‌ హనుమ విహారిని ఎంపికచేయకపోవడం తనను ఆశ్చర్యపరిచిందన్న గంభీర్‌... ఇండియా ‘ఏ’ జట్టులో మాత్రం స్థానం ఎందుకని ప్రశ్నించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో చక్కగా రాణించే విహారి.. రహానే లేదంటే మిడిలార్డర్‌లో ఎవరో ఒకరి స్థానాన్ని భర్తీ చేయగలడని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నాడు.

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టు: అజింక్య రహానే(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, ఛతేశ్వర్ పుజారా(వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అ‍య్యర్‌, వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), కేఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, ఆర్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, జయంత్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిధ్‌ కృష్ణ, విరాట్‌ కోహ్లి(రెండో టెస్టు నుంచి అందుబాటులోకి).

చదవండి: Rohit Sharma- Ashwin: అశ్విన్‌పై రోహిత్‌ ప్రశంసలు.. కెప్టెన్‌కు అటాకింగ్‌ ఆప్షన్‌ అంటూ..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top