Ind Vs Nz 1st Test: Trolls On Wriddhiman Saha After His Lost Against New Zealand - Sakshi
Sakshi News home page

Trolls On Wriddhiman Saha: ఏం ఆడుతున్నావయ్యా బాబూ.. ఇకనైనా భరత్‌ను తీసుకుంటారా?

Published Fri, Nov 26 2021 11:53 AM

Ind Vs Nz 1st Test: Twitter Trolls Wriddhiman Saha Dismissal Wants KS Bharat - Sakshi

Twitter reacts after Wriddhiman Saha was dismissed against New Zealand: టీమిండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ వృద్ధిమాన్‌ సాహా మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుట్‌ అయ్యాడు. రెండో రోజు ఆటలో భాగంగా 50 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవీంద్ర జడేజా నిష్క్రమించగా 88వ ఓవర్‌లో సాహా క్రీజులోకి వచ్చాడు. కివీస్‌ బౌలర్‌ సౌథీ బౌలింగ్‌లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డ.. అతడు 93వ ఓవర్‌లో ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. 12 బంతులు ఎదుర్కొని ఒక పరుగు సాధించి పెవిలియన్‌ చేరాడు.

ఈ నేపథ్యంలో సాహా ఆట తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా సాహాను జట్టు నుంచి తప్పించి అతడి స్థానంలో కేఎస్‌ భరత్‌ను ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ‘‘ఏం ఆడుతున్నావయ్యా! ఆటపై కాస్త దృష్టి పెట్టు! సాహాను ఇంకా జట్టులో కొనసాగించడం ఎందుకు? ఇప్పటికైనా అతడిని కాదని రిషభ్‌ పంత్‌ను ఎందుకు తీసుకుంటారో అర్థమవుతోందా! సాహా ఫామ్‌లో లేడు కదా! బైబై చెప్పేయండి! సాహాకు బదులు కేఎస్‌ భరత్‌ను జట్టులోకి తీసుకోండి!’’ అని ట్రోల్‌ చేస్తున్నారు. కాగా రిషభ్‌ పంత్‌కు విశ్రాంతినివ్వడంతో... తెలుగు క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌ను న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: IND Vs NZ: అరంగేట్ర మ్యాచ్‌లో రికార్డులు సృష్టించిన శ్రేయస్‌ అయ్యర్‌..

Advertisement
Advertisement