IND Vs AUS: కేఎల్‌ రాహుల్‌ హాఫ్‌ సెంచరీ.. కోహ్లి రియాక్షన్‌ సూపర్‌! వీడియో వైరల్‌

IND Vs AUS: Virat Kohlis reaction after KL Rahul completes his fifty - Sakshi

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ తనపై వస్తున్న విమర్శలకు ఒక్క ఇన్నింగ్స్‌తో చెక్‌ పెట్టాడు. ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్‌.. 75 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

189 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హార్దిక్‌ పాండ్యా, జడేజాలతో కలిసి రాహుల్‌ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఆఖరి వరకు క్రీజులో నిలిచిన రాహుల్‌.. జట్టుకు మరపురాని విజయాన్ని అందించాడు.

రాహుల్‌ హాఫ్‌ సెంచరీ.. కోహ్లి రియాక్షన్‌ వైరల్‌
రాహుల్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకోగానే డ్రెసింగ్‌ రూంలో ఉన్న వారంతా లేచి నిలబడి అభినందించారు. ఈ సమయంలో డ్రెసింగ్‌ రూంలో కాఫీ తాగుతూ ఉన్న కోహ్లి.. పైకి లేచి రాహుల్‌కు ప్రత్యేకమైన స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చాడు.

చేతిలో కాఫీ కప్‌ను పట్టుకుని రాహుల్‌ను చప్పట్లు కొడుతూ విరాట్‌ అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా​ ఈ మ్యాచ్‌లో రాహుల్‌తో పాటు జడేజా కూడా అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక భారత్‌-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే విశాఖ వేదికగా మార్చి19న జరగనుంది.
చదవండి: IND vs AUS: హార్దిక్‌పై కోపంతో ఊగిపోయిన కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top