
India vs Australia, 1st Test Day 2 Updates And Highlights:
ముగిసిన రెండో రోజు ఆట
టీమిండియా- ఆస్ట్రేలియా తొలి టెస్టులో భాగంగా రెండో రోజు ఆట ముగిసింది. నాగ్‌పూర్ మ్యాచ్‌లో శుక్రవారం నాటి ఆటలో రోహిత్ శర్మ(120) సెంచరీతో మెరిశాడు. ఇక ఆట ముగిసే సమయానికి జడేజా(66), అక్షర్ అజేయ అర్ధ శతకాలతో క్రీజులో ఉన్నారు. వీరి ముగ్గురి అద్భుత ప్రదర్శన కారణంగా భారత్ 144 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ఇక ఆసీస్ బౌలర్లలో అరంగేట్ర స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. మరో స్పిన్నర్ నాథన్ లియోన్ ఒక వికెట్ దక్కించుకోగా.. స్టార్ పేసర్,కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రోహిత్ శర్మ వికెట్ దక్కించుకున్నాడు.
►110.4: అక్షర్ పటేల్ అర్ధ శతకం
►99 ఓవర్లలో టీమిండియా 282/7
►అర్ధ శతకంతో చెలరేగిన జడేజా
బంతితో ఆసీస్‌ను ముప్పుతిప్పలు పెట్టిన టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాట్‌తోనూ మెరిశాడు. అర్ధ శతకం పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్నాడు.
►ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా
టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన శ్రీకర్ భరత్ టాడ్ ముర్ఫే బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది.
►80.4: రోహిత్ శర్మ అవుట్
టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(120) బౌల్డ్ అయ్యాడు. జడేజా, శ్రీకర్ భరత్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 229/6 (81). 52 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్న టీమిండియా.
►టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 226/5 (80)
73 ఓవర్లకు భారత్ స్కోర్: 209/5
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 200 పరుగుల మార్క్‌ను దాటింది. 73 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(108), జడేజా(27) పరుగులతో ఉన్నారు.
65: 10 పరుగుల ఆధిక్యంలో భారత్
స్కోరు: 187/5 (65)
తొలి రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా 177 పరుగులకు ఆలౌట్ అయింది.
62.4: సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ
టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో ఫోర్ బాది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శతకం పూర్తి చేసుకున్నాడు. 64 ఓవర్లలో టీమిండియా స్కోరు: 182-5.
59.1: సూర్య కుమార్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా
నాథన్ లియోన్ బౌలింగ్‌లో టీమిండియా అరంగేట్ర టెస్టు బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ బౌల్డ్ అయ్యాడు. 20 బంతులు ఎదుర్కొన్న అతడు 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.
నాలుగో వికెట్ డౌన్.. కోహ్లి ఔట్
151 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా ఆసీస్ సాధించిన నాలుగు వికెట్లు కూడా మర్ఫీ పడగొట్టడం విశేషం. క్రీజులోకి అరంగేట్ర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.
లంచ్ విరామానికి భారత్ స్కోర్: 151/3
రెండో రోజు లంచ్ విరామానికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(85), విరాట్ కోహ్లి(12) పరుగులతో క్రీజులో ఉన్నారు.
మూడో వికెట్ డౌన్
135 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన పుజారా.. టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో బోలాండ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు.
రెండో వికెట్ డౌన్
40.1: అశ్విన్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. అరంగేట్ర ఆసీస్ బౌలర్ టాడ్ మర్ఫీ అశూ(23)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని పెవిలియన్‌కు పంపాడు. ఇక మొదటి రోజు ఆటలో భాగంగా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను సైతం మర్ఫీ అవుట్ చేసిన సంగతి తెలిసిందే. పుజారా(6), రోహిత్(73) క్రీజులో ఉన్నారు. స్కోరు: 124-2(41)
100 పరుగుల మార్కు దాటిన టీమిండియా
32 ఓవర్లలో భారత్ స్కోరు: 102-1.. రోహిత్ శర్మ(67), అశ్విన్(14) పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండో రోజు ఆట ప్రారంభం..
నాగ్‌పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ రెండో రోజు తొలి ఓవర్ వేసేందుకు స్పిన్నర్ ముర్ఫీ చేతికి బంతి అందించాడు. కాగా క్రీజులో రోహిత్ శర్మ(55), అశ్విన్(0) పరుగులతో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది.
తుది జట్లు:
టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా:
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, మాట్ రెన్షా, పీటర్ హ్యాండ్స్కాంబ్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్