టీ-20 వరల్డ్ కప్‌: అక్టోబర్ 24న భారత్, పాక్ మ్యాచ్‌

Icc T20 World Cup 2021: India To Face Pakistan On October 24th In Dubai - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ పాక్‌ మధ్య మ్యాచ్‌ అంటే ఆ మాజాయే వేరు. ఈ ఏడాది జరగనున్న టీ-20 ప్రపంచ కప్‌ ద్వారా క్రికెట్‌ ప్రేమికులు దాన్ని ఆస్వాదించనున్నారు. ప్రపంచకప్‌ కోసం ఐసీసీ విడుదల చేసిన జాబితాలో పాకిస్తాన్‌, భారత్‌ గ్రూప్‌-2 నుంచి పొట్టి ప్రపంచ కప్‌ సమరానికి పోటీలో పాల్గొంటున్నాయి.  చిరకాల ప్రత్యర్థులైన రెండు జట్లు ఈ ఏడాది దుబాయ్‌ వేదికగా అక్టోబర్ 24న జరగనున్న మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇక అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు టీ-20 ప్రపంచకప్‌ జరుగుతుందన్న సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top