
PC: IPL.com
ఐపీఎల్-2022లో విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కోహ్లి తనతో తలపడి ఉంటే కేరిర్‌లో ఇన్ని పరుగులు సాధించి ఉండేవాడిని కాదని అక్తర్ తెలిపాడు. ఐపీఎల్‌లో స్టార్ ఆటగాళ్లు రాణించకపోతే ఆ జట్టు వారిని పక్కన పెట్టాలి అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ పేర్కొన్నాడు. కాగా కోహ్లి , అక్తర్ 2010 ఆసియా కప్‌లో తలపడ్డారు.
అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లికు ఆడే అవకాశం రాలేదు. కాగా గతంలో కోహ్లి కూడా అక్తర్‌తో తలపడాలన్న తన కోరికను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్‌తో పోటీపడడాన్ని తాను ఆస్వాదిస్తాని కోహ్లి తెలిపాడు. "విరాట్ కోహ్లి ఒక అద్భుతమైన ఆటగాడు. అయితే స్టార్ ఆటగాళ్లు నుంచి భారీ ఇన్నింగ్స్‌ను మాత్రమే ఆశిస్తాము. నేను కోహ్లికు తన కేరిర్‌లో బౌలింగ్ చేసి వుంటే అతడు ఇన్నింగ్ పరుగులు సాధించేవాడు కాదు.
అతడు అత్యత్తుమ ఆటగాడు ఆనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రస్తుతం కోహ్లి పరుగులు సాధించాడానికి చాలా కష్టపడుతున్నాడు. కోహ్లి నుంచి ఎప్పుడూ నేను భారీ ఇన్నింగ్స్‌ను మాత్రమే ఆశిస్తాను" అని అక్తర్ పేర్కొన్నాడు. ఇక తన అంతర్జాతీయ కెరీర్‌లో 458 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 23, 650 పరుగులు సాధించాడు.