Kohli Jersey Number Secret: కోహ్లీ జెర్సీ నెంబర్ వెనుక​ కన్నీటి కథ.. ఏంటంటే?

Heres why Virat Kohli wears jersey Number 18 - Sakshi

ప్రపంచ క్రికెట్‌లో జెర్సీ నంబరు 18ను ఎంతమంది ధరించినా.. టక్కున గుర్తుచ్చేది మాత్రం టీమిండియా మాజీ కెప్టెన్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లినే. విరాట్‌ ఏ ఫార్మట్ లో చూసినా నెంబర్ 18 జెర్సీనే ధరిస్తాడు. అండర్ 19 ఆడేటప్పటి నుంచి ఈ జెర్సీనే వేసుకుంటాడు. మరో నెంబర్ మార్చే ప్రయత్నం చేయలేదు.  కోహ్లి జెర్సీ నెంబర్‌ 18 వెనుక ఓ కన్నీటి గాధ దాగి ఉంది. తన తండ్రి గుర్తుగా నెంబర్ 18 ధరిస్తున్నట్లు కోహ్లినే స్వయంగా వెల్లడించాడు.

నాన్నకు ప్రేమతో..
2006 డిసెంబర్‌ 18వ తేదీ కోహ్లికి తన జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ రోజున కోహ్లి తన తండ్రిని కోల్పోయాడు. ప్రేమ్‌ కోహ్లి గుండెపోటుతో మరణించాడు. తన తండ్రి మరణించిన సమయంలో కోహ్లి కర్ణాటకతో ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్‌ ఆడుతున్నాడు.

ఈ వార్త విన్న కోహ్లి బాధను దిగిమింగి మరి తన ఆటను కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 90 పరుగులు చేసి ఢిల్లీని ఫాలోఆన్‌ గండం నుంచి తప్పించాడు. మ్యాచ్ ముగిశాక తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అయితే తన జీవితంలో ఆ చీకటి రోజుని మరోసారి విరాట్ గుర్తుచేసుకున్నాడు.

"మా నాన్న చనిపోయిన ఆ రాత్రి నాకు ఇంకా గుర్తుంది.  కానీ మా నాన్న మరణం తర్వాత నా ఆటను కొనసాగించాలని పిలుపు వచ్చింది.  నేను కూడా ఆ రోజు ఉదయం ఢిల్లీ కోచ్‌కు ఫోన్ చేసాను. నేను ఈ మ్యాచ్‌లో ఆడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆటను మధ్యలో విడిచిపెట్టి రావడం సరికాదు అని భావించాను. ఆ క్షణం నన్ను ఒక వ్యక్తిగా మార్చింది. 

నా జీవితంలో క్రికెట్‌కు చాలా ప్రాముఖ్యత ఇస్తాను. ఇక మా నన్న మరణించిన రోజు గుర్తుగా జెర్సీ నంబరు 18గా ఎంచుకున్నాను. అదృష్టవశాత్తూ భారత జట్టులో చేరేటప్పటికీ ‘జెర్సీ నంబరు 18’ ఖాళీగా ఉంది.  దీంతో అదే నంబరును కొనసాగించాను అని కోహ్లి సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇక కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్‌కు సన్నద్దం అవుతున్నాడు. ఇప్పటికే జట్టుతో కలిసిన విరాట్‌.. చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తున్నాడు.
చదవండి: IPL 2023: కోహ్లికి ముచ్చెమటలు పట్టించాడు.. ఇప్పుడు రాజస్తాన్‌ జట్టులో చోటు కొట్టేశాడు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top