‘నన్ను రిటైర్ అవ్వమంటున్నారా?’.. భారత కెప్టెన్‌ అసహనం! | Harmanpreet snaps back at reporter over retirement question | Sakshi
Sakshi News home page

‘నన్ను రిటైర్ అవ్వమంటున్నారా?’.. భారత కెప్టెన్‌ అసహనం!

Jun 8 2026 2:27 PM | Updated on Jun 8 2026 2:37 PM

Harmanpreet snaps back at reporter over retirement question

జూన్ 11 నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి పొట్టి ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ వేదిక కానుంది. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్న ఆయా జట్ల కెప్టెన్లు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా లండన్‌లో ఒక మీడియా కార్యక్రమంలో పాల్గొంది.

ఈ సందర్భంగా ఒక రిపోర్టర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ఉద్దేశించి..‘హర్మన్‌ప్రీత్ కౌర్.. ఇది మీకు చివరి టీ20 ప్రపంచ కప్ అవుతుందా? దీనిపై మీరేమంటారు?’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో ఒక్కసారిగా అసహనానికి గురైన హర్మన్‌ప్రీత్ కౌర్.. ‘ఇది నా చివరి వరల్డ్ కప్ ఎందుకు అవుతుంది? నేనేమైనా రిటైర్ అయిపోవాలని మీరు కోరుకుంటున్నారా?’ అంటూ హర్మన్‌ప్రీత్ ఎదురుప్రశ్న వేశారు. 

దాంతో సదరు రిపోర్టర్ పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తూ.. ‘లేదు.. నేను కేవలం తెలుసుకోవాలని అడిగాను. ఇది మీ చివరి ప్రపంచకప్ కాదని వినడం నాకు సంతోషంగా ఉంది’ అని రిపోర్టర్ చెప్పారు. అయినప్పటికీ తగ్గని హర్మన్‌ప్రీత్ కౌర్.. ‘మరి అలాంటప్పుడు అసలు ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు?’ అంటూ నిలదీశారు. 

హర్మన్ మాట్లాడుతూ.. వన్డే వరల్డ్‌కప్ నెగ్గడంతో సహజంగానే మాపై అంచనాలు ఉంటాయి. భారీ అంచనాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఆ అంచనాలను అందుకుంటూనే ఆటపై పూర్తి ఫోకస్‌ను ఉండేలా చూసుకోవాలి. కానీ వన్డే ఫార్మాట్, టీ20 ఫార్మాట్‌లు వేర్వేరు. ఈ రెండింటికీ వ్యత్యాసం ఉంటుంది. 

మ్యాచ్‌ల విషయంలో ప్రజలు ఎంతో భావోద్వేగంతో ఉంటారు. వారు ఎప్పటికప్పుడు మమ్మల్ని నిశితంగా పరిశీలిస్తారు. ’ అని చెప్పుకొచ్చింది. గతేడాది సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌ను గెలిచిన హర్మన్‌సేనపై భారీ అంచనాలున్నాయి.  జూన్ 14 నుంచి భారత్ తమ ప్రపంచకప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement