సౌతాఫ్రికా గడ్డపై భారత మహిళల జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. బుధవారం జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లోనూ 9 వికెట్ల తేడాతో భారత్ పరాజయం పాలైంది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో ఉమెన్ ఇన్ బ్లూ కోల్పోయింది.
అయితే ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా హర్మన్ సరికొత్త రికార్డు సృష్టించింది.
ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు(3016) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో ఆటపట్టును హర్మన్ అధిగమించింది. హర్మన్ ఇప్పటివరకు భారత కెప్టెన్‌గా 3017 పరుగులు చేసింది. ఈ జోహాన్స్‌బర్గ్ వన్డే హర్మన్ తన విశ్వరూపం ప్రదర్శించింది. హర్మన్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేసి భారత తరపున టాప్ స్కోరర్‌గా నిలిచింది.
మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు వీరే
హర్మన్‌ప్రీత్ కౌర్-3017
చమరి అటపట్టు-3016
మెగ్ లానింగ్- 2619
షార్లెట్ ఎడ్వర్డ్స్-2529
సూజీ బేట్స్-2236
చదవండి: IND vs IRE: టీమిండియాలోకి ఫాస్ట్ బౌలింగ్ సంచలనం!


