హార్దిక్ పాండ్యా విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 28 పరుగులు! వీడియో వైరల్‌ | Hardik Pandya Turns On The Heat With 28 Run Over In SMAT | Sakshi
Sakshi News home page

SMAT 2024: హార్దిక్ పాండ్యా విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 28 పరుగులు! వీడియో వైరల్‌

Published Fri, Nov 29 2024 3:44 PM | Last Updated on Fri, Nov 29 2024 4:17 PM

Hardik Pandya Turns On The Heat With 28 Run Over In SMAT

స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ టోర్నీలో బ‌రోడాకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పాండ్యా మ‌రోసారి విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా శుక్ర‌వారం త్రిపుర‌తో జ‌రిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు.

త్రిపుర బౌలర్ల‌కు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా త్రిపుర స్పిన్న‌ర్ పర్వేజ్ సుల్తాన్‌ను ఈ బ‌రోడా ఆల్‌రౌండర్ ఊతికారేశాడు. బ‌రోడా ఇన్నింగ్స్ 10వ ఓవ‌ర్ వేసిన ప‌ర్వేజ్ బౌలింగ్‌లో 4 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో పాండ్యా 28 ప‌రుగులు పిండుకున్నాడు.

ఓవ‌రాల్‌గా 23 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 3 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 47 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. పాండ్యా విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఫ‌లితంగా బ‌రోడా 110 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 11.2 ఓవ‌ర్ల‌లో చేధించింది. బ‌రోడా బ్యాట‌ర్ల‌లో పాండ్యాతో పాటు మితీష్ ప‌టేల్ 37 ప‌రుగుల‌తో ఆజేయంగా నిలిచాడు.

అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన త్రిపుర నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 109 ప‌రుగులు చేసింది. త్రిపుర బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ మ‌న్‌దీప్ సింగ్‌(50) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

బ‌రోడా బౌల‌ర్ల‌లో అభిమ‌న్యు సింగ్ మూడు వికెట్లు, కెప్టెన్ కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 115.50 సగటుతో 231 పరుగులు చేశాడు.
చదవండి: Asia Cup 2024: రేపే భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌.. లైవ్ ఎక్క‌డో తెలుసా?

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement