గంభీర గర్జన.. కేకేఆర్‌పై గెలుపు అనంతరం లక్నో మెంటార్‌ ఉద్వేగం

Gautam Gambhir Angry Celebration After LSG Beat KKR Goes Viral - Sakshi

నరాలు తెగే ఉత్కంఠ నడుమ నిన్న (మే 18) కేకేఆర్‌తో జరిగిన రసవత్తర సమరంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో లక్నో 2 పరుగుల స్వల్ప తేడాతో బయటపడింది. ఫలితంగా కేకేఆర్‌ ఇంటికి, లక్నో ప్లే ఆఫ్స్‌కు చేరాయి.

మ్యాచ్‌ ఆఖరి బంతికి 3 పరుగులు చేయాల్సిన సమయంలో స్టోయినిస్‌..ఉమేశ్‌ యాదవ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసి లక్నో విజయాన్ని ఖరారు చేశాడు. ఈ సందర్భంగా లక్నో డగౌట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. అప్పటివరకు టెన్షన్‌ తట్టుకోలేక కళ్లు మూసుకుని డగౌట్‌లో కూర్చున్న లక్నో మెంటార్‌ జట్టు విజయం సాధించగానే తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యాడు. గట్టిగా గర్జిస్తూ, గాల్లోకి పంచ్‌లు విసురుతూ తన ఆనందాన్ని సహచరులతో పంచుకున్నాడు. గంభీర గర్జనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.

కాగా, లక్నో-కేకేఆర్‌ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌ చాలాకాలం తర్వాత ప్రేక్షకులకు అసలుసిసలైన ఐపీఎల్‌ మజాను అందించింది. ఈ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో కేకేఆర్‌ విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. స్టోయినిస్‌ బౌలింగ్‌లో రింకూ సింగ్ వరుసగా 4, 6, 6, 2 పరుగులు చేసి మ్యాచ్‌ను కేకేఆర్‌వైపు తిప్పాడు. ఇక కేకేఆర్‌ గెలుపు లాంఛనమే (2 బంతుల్లో 3 పరుగులు) అనుకుంటున్న తరుణంలో స్టోయినిస్‌ విజృంభించి చివరి రెండు బంతులకు రెండు వికెట్లు తీసి కేకేఆర్‌ పుట్టిముంచాడు. 
చదవండి: IPL 2022: కోల్‘కథ’ ముగిసింది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

19-05-2022
May 19, 2022, 13:03 IST
IPL 2022 RCB Vs GT: ఐపీఎల్‌-2022లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కేవలం 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ రేసులో...
19-05-2022
May 19, 2022, 11:59 IST
రింకూ సింగ్‌పై బ్రెండన్‌ మెకల్లమ్‌ ప్రశంసల జల్లు
19-05-2022
May 19, 2022, 11:32 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ (మే 19) మరో డూ ఆర్‌ డై మ్యాచ్‌ జరుగనుంది. టేబుల్‌ టాపర్‌ అయిన...
19-05-2022
May 19, 2022, 10:44 IST
IPL 2022 KKR Vs LSG: Shreyas Iyer Comments- ‘‘నేను ఏమాత్రం బాధపడటం లేదు. నేను ఆడిన అత్యుత్తమ...
19-05-2022
May 19, 2022, 09:56 IST
ఐపీఎల్ 2022 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కథ ముగిసింది. ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించిన కేకేఆర్‌ ఓటమితో ముగించి...
19-05-2022
May 19, 2022, 09:12 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌ చివరి దశలో క్రికెట్‌ ప్రేమికులకు కావాల్సిన అసలుసిసలైన మజా లభించింది. నిన్న (మే 18) లక్నో...
19-05-2022
May 19, 2022, 05:47 IST
ముంబై: ఐపీఎల్‌ చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్‌ భాగస్వామ్యం... ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లూ ఆడిన జోడీ... ఐపీఎల్‌ చరిత్రలో మూడో...
18-05-2022
May 18, 2022, 22:36 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ సెంచరీతో చెలరేగాడు. కేవలం 70...
18-05-2022
May 18, 2022, 21:48 IST
లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌, కేఎల్‌ రాహుల్‌ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక భాగస్వా‍మ్యం...
18-05-2022
18-05-2022
May 18, 2022, 18:15 IST
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు రాహుల్ త్రిపాఠిపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్ ప్రశంసలు వర్షం కురిపించాడు. ఐపీఎల్‌-2022లో రాహుల్‌...
18-05-2022
May 18, 2022, 16:51 IST
IPL 2022 SRH vs MI: Bhuvneshwar Kumar Comments: ‘‘డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేసేటపుడు కూల్‌గా ఉండాలి. అలాంటి...
18-05-2022
May 18, 2022, 12:42 IST
ముంబై ఇండియన్స్‌పై గెలుపుతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఆ జట్టు...
18-05-2022
May 18, 2022, 11:59 IST
15 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ముంబై ఇండియన్స్‌ తొలిసారి ఓ ఘోర అనుభవాన్ని ఎదుర్కొంది. నిన్న సన్‌రైజర్స్‌ చేతిలో పరాజయంతో...
18-05-2022
May 18, 2022, 11:53 IST
IPL 2022 MI vs SRH- Jasprit Bumrah Record: టీమిండియా స్టార్‌ బౌలర్‌, ముంబై ఇండియన్స్‌ ఆటగాడు జస్‌ప్రీత్‌...
18-05-2022
May 18, 2022, 11:15 IST
రాహుల్‌ త్రిపాఠిపై ఆకాశ్‌ చోప్రా ప్రశంసల జల్లు
18-05-2022
May 18, 2022, 11:15 IST
ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 194 పరుగల...
18-05-2022
May 18, 2022, 09:59 IST
ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. నరాలు...
18-05-2022
May 18, 2022, 09:27 IST
టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ వెండితెరపై మెరువనున్నాడా అంటే.. అవుననే సమాధానమే వినబడుతుంది. సరదా కోసం టిక్‌ టాక్...
18-05-2022
May 18, 2022, 07:15 IST
ముంబై: ఓడితే ఐపీఎల్‌లో ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు కోల్పోయే స్థితిలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సత్తా చాటింది.... 

Read also in:
Back to Top