IPL 2022: కోల్‘కథ’ ముగిసింది | IPL 2022: LSG Pull Off last Ball Win To Eliminate KKR | Sakshi
Sakshi News home page

LSG VS KKR: కేకేఆర్‌ వీరోచిత పోరాటం​.. ఉత్కంఠ పోరులో లక్నోదే విజయం

May 19 2022 9:56 AM | Updated on May 19 2022 10:43 AM

IPL 2022: LSG Pull Off last Ball Win To Eliminate KKR - Sakshi

Photo Courtesy: IPL

ఐపీఎల్ 2022 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కథ ముగిసింది. ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించిన కేకేఆర్‌ ఓటమితో ముగించి లీగ్‌ నుంచి నిష్క్రమించింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ నిన్న (మే 18) లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైన శ్రేయస్‌ సేన.. ప్రస్తుత ఎడిషన్‌లో 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 8 పరాజయాలు నమోదు చేసింది. 

భారీ అంచనాలతో సీజన్‌ బరిలోకి దిగిన కేకేఆర్‌ స్వయంకృతాపరాధాల కారణంగా ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. చెన్నైపై గ్రాండ్‌ విక్టరీతో సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన శ్రేయస్‌ సేన.. ఆతర్వాత ఆర్సీబీ చేతిలో ఘోరంగా ఓడింది. ఆతర్వాత పంజాబ్‌, ముంబైలపై భారీ విజయాలు సాధించినప్పటికీ.. ఢిల్లీ, సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఢిల్లీ చేతిలో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో పరాజయంపాలైంది. 

తిరిగి రాజస్థాన్‌పై గెలిచినా మళ్లీ లక్నో చేతిలో ఓడింది. ఈ దశలో మేలుకున్న కేకేఆర్‌.. ముంబై, సన్‌రైజర్స్‌లపై వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో లక్నో చేతిలో ఓటమిపాలై లీగ్‌ నుంచి నిష్క్రమించింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన కేకేఆర్‌ ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరకుండానే వైదొలగడం ఆ జట్టు అభిమానులను తీవ్రంగా కలచి వేస్తుంది. పేపర్‌పై బలమైన జట్టుగా కనిపిస్తున్నా సరైన విజయాలు సాధించలేకపోవడాన్ని కేకేఆర్‌ అభిమానలు జీర్ణించుకోలేకపోతున్నారు. 
చదవండి: డికాక్‌, రాహుల్‌ విధ్వంసం ధాటికి బద్దలైన రికార్డులు ఇవే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement