క్రికెట్‌ ఆస్ట్రేలియాలో విషాదం.. గంటల వ్యవధిలో ఇద్దరు దిగ్గజాల కన్నుమూత

Former Australia Spinner Peter Philpott Dies At 86 - Sakshi

Former Australia Spinner Peter Philpott Passed Away: ఆసీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ అలన్ డేవిడ్‌సన్ కన్నుమూసిన గంటల వ్యవధిలోనే క్రికెట్‌ ఆస్ట్రేలియాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ స్పిన్నర్ పీటర్‌ ఫిల్‌పాట్‌ 86 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో కన్నుమూశాడు. పీటర్ మృతితో క్రికెట్ ఆస్ట్రేలియాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. లెగ్‌స్పిన్ ఆల్‌రౌండర్ అయిన పీటర్‌.. 60వ దశకంలో ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ప్రాతనిధ్యం వహించాడు. 8 టెస్ట్‌ల్లో 38.46 సగటుతో 26 వికెట్లు తీసుకున్నాడు. కెరీర్‌ అత్యుత్తమ దశలో ఉండగానే పీటర్ 31 ఏళ్ల వయసులో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. 
చదవండి: టీమిండియాతో మ్యాచ్‌ రోజు పాక్‌ కెప్టెన్‌ తీవ్ర ఆవేదనలో ఉన్నాడు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top