Anju Bobby George: మాజీ అథ్లెట్‌ అంజూ బాబీ జార్జీకి అరుదైన గౌరవం

Former Athlete Anju Bobby George Wins World Athletics Woman Of Year Award - Sakshi

Former Indian Athlete Anju Bobby George Was Women Of The Year.. భారత మాజీ మహిళా అథ్లెట్‌ అంజూ బాబీ జార్జీకి అరుదైన గౌరవం దక్కింది. అథ్లెట్‌ విభాగంలో ఆమె చేసిన సేవలకు గాను వరల్డ్‌ అథ్లెటిక్స్‌ 2021 ఏడాదికి గానూ ''వుమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'' అవార్డుతో సత్కరించింది. లాంగ్‌జంప్‌లో ఎన్నో రికార్డులు, ఘనతలు సాధించిన ఆమె రిటైర్మెంట్‌ తర్వాత 2016లో అమ్మాయిల కోసం ట్రైనింగ్‌ అకాడమీని నెలకొల్పి శిక్షణ ఇచ్చింది. కాగా ఇప్పటికే అండర్‌ 20 విభాగంలో అంజూ బాబీ జార్జీ శిక్షణలో రాటుదేలిన పలువురు యువతులు మెడల్స్‌ కూడా సంపాదించారు.

ఎంతోమంది భారతీయ యువతులకు ఆదర్శంగా నిలిచిన అంజూబాబీ జార్జీ.. ''వుమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'' అవార్డుకు అర్హురాలని ఇండియన్‌ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక మెన్స్‌ విభాగంలో ఒలింపియన్స్‌ అయిన జమైకాకు చెందిన ఎలైన్‌ థాంప్సన్‌.. నార్వేకు చెందిన కార్‌స్టెన్‌ వార్లోమ్‌లు ''వరల్డ్‌ అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌'' అవార్డుకు ఎంపికయ్యారు.

1977లో కేరళలో జన్మించిన అంజూ బాబీ జార్జీ లాంగ్‌జంప్‌ విభాగంలో ఎన్నో పతకాలు సాధించింది.వాటిని ఒక్కసారి పరిశీలిద్దాం.
2003 పారిస్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో లాంగ్‌జంప్‌ విభాగంలో కాంస్య పతకం
2005 వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఫైనల్లో బంగారు పతకం
2002 మాంచెస్టర్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో కాంస్యం
2002 బుసాన్‌, 2006 దోహా ఆసియా క్రీడల్లో స్వర్ణం, రజతం
2005 ఇంచియాన్‌, 2007 అమ్మన్‌ ఏషియన్‌ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం, రజతం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top