ఆర్‌సీబీ హెడ్‌ కోచ్‌గా ఫ్లవర్‌  | Flower as head coach of RCB | Sakshi
Sakshi News home page

ఆర్‌సీబీ హెడ్‌ కోచ్‌గా ఫ్లవర్‌ 

Aug 5 2023 4:04 AM | Updated on Aug 5 2023 9:49 AM

Flower as head coach of RCB - Sakshi

బెంగళూరు: ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా విజేతగా నిలువలేకపోయిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) మరోసారి కోచింగ్‌ బృందంలో కీలక మార్పు చేసింది. జట్టు హెడ్‌ కోచ్‌గా జింబాబ్వే మాజీ కెపె్టన్, కోచింగ్‌లో అపార అనుభవం ఉన్న ఆండీ ఫ్లవర్‌ను ఎంపిక చేసింది.

దాంతో ఇప్పటి వరకు హెడ్‌ కోచ్‌గా ఉన్న సంజయ్‌ బంగర్‌తో పాటు క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌  హోదాలో టీమ్‌ను పూర్తి స్థాయిలో నడిపించిన మైక్‌ హెసన్‌పై వేటు పడినట్లయింది. నాలుగు సీజన్ల పాటు హెసన్‌ డైరెక్టర్‌గా పని చేయగా... మూడుసార్లు ప్లే ఆఫ్స్‌కు చేరిన బెంగళూరు 2023 సీజన్‌లో ఆరో స్థానంతో ముగించింది. అయితే ఈ ప్రదర్శన ఆర్‌సీబీ యాజమాన్యానికి సంతృప్తినివ్వలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement