Real Madrid: ప్రెసిడెంట్‌ ఆడియో టేప్‌ లీక్‌.. రొనాల్డోపై తీవ్ర వ్యాఖ్యలు

Florentino Perez Says On Leaked Audio Cristiano Ronaldo Is Idiot Sick Man - Sakshi

లిస్బన్‌: క్రిస్టియానో రొనాల్డో ఆటతోనే కాదు.. తన మేనరిజంతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు. అయితే తాజాగా క్రిస్టియానో ​​రొనాల్డో, మేనేజర్ జోస్ మౌరిన్హోలను రియల్ మాడ్రిడ్ అధ్యక్షుడు ఫ్లోరెంటినో పెరెజ్ ఎగతాళి చేసిన ఆడియో టేపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ ఆడియోక టేపులో క్రిస్టియానో రొనాల్డో ఓ ఇడియట్‌, జబ్బు మనిషి అంటూ విమర్షించారు. ‘‘రొనాల్డో ఓ వెర్రివాడు. ఇడియట్‌, జబ్బు మనిషి. అందరూ అతడు సాధారణంగా ఉన్నాడు అనుకుంటారు.

కానీ అతను చేయాల్సిన పనులు చేయరు. అతను ఏదో చేస్తాడని మీరు అనుకుంటారు. కానీ ఏమీ చేయడు.’’ అంటూ విమర్షించారు. మెండిస్‌కు , మేనేజర్ జోస్ మౌరిన్హో ఇద్దరికీ రొనాల్డోపై నియంత్రణ లేదు. వారిద్దరికీ చాలా అహంకారం ఉంది. డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చు. మనం ఈ రోజు డబ్బులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దాంతో వారు గొప్ప వాళ్లుగా కనిపిస్తారు.’’ అంటూ పెరెజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top