
PC: IPl.com
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ తమ పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఈ ఏడాది సీజన్‌లో వరుసగా రెండో ఓటమి చవిచూసింది. లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ ఆరంభం నుంచే తడబడింది.
పిచ్‌పై బంతి అద్భుతంగా టర్న్ అవ్వడం గమనించిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను పవర్‌ప్లే లోపే స్పిన్నర్లను రంగంలోకి దించాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా.. అగర్వాల్ వికెట్ పడగొట్టి అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. అనంతరం ఏ దశలోనూ హైదరాబాద్ బ్యాటర్లు లక్నోకు పోటీఇవ్వలేకపోయారు.
ఆ పని ముందే చేయాల్సింది..
9 ఓవర్లు ముగిసే సమయానికి ఎస్‌ఆర్‌హెచ్ కేవలం 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇటువంటి సమయంలో ఎస్‌ఆర్‌హెచ్ మెనెజ్‌మెంట్ పెద్ద తప్పు చేసింది. బ్యాటింగ్ లైనప్‌లో ముందు ఉన్న అబ్ధుల్ సమద్‌ను కాదని వాషింగ్టన్ సుందర్‌ను పంపింది. ఇదే సన్‌రైజర్స్ కొంపముంచింది. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్ టెస్టు మ్యాచ్‌ను తలపించేలా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.
28 బంతులు ఎదుర్కొన్న సుందర్ 16 పరుగులు మాత్రమే చేసి తీవ్ర నిరాశపరిచాడు. ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ 17 ఓవర్‌లో రాహుల్ త్రిపాఠి ఔటైన వెంటనే అబ్దుల్ సమద్ క్రీజులోకి వచ్చాడు. అతడు తన ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచాడు. కేవలం 10 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సమద్ 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 21 పరుగులు చేశాడు.
అయితే సమద్ క్రీజులోకి వచ్చినప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమద్ సంచలన ఇన్నింగ్స్ ఆడడంతో ఎస్‌ఆర్‌హెచ్ 121 పరుగులైనా చేయగల్గింది. ఇక సుందర్ స్థానంలో సమద్ బ్యాటింగ్ వచ్చే పరిస్ధితి మరోవిధంగా ఉండేదని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. అదే విధంగా రాజస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సమద్ 32 పరుగులు చేసి అందరని అకట్టుకున్నాడు.
చదవండి: IPL 2023 SRH vs LSG: ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు