Virat Kohli: ఒకప్పుడు సచిన్‌, ద్రవిడ్‌లు అనుభవించారు.. ఇప్పుడు కోహ్లి

Ex-Cricketer Says Tendulkar-Dravid Gone Through Such Phase Kohli Century - Sakshi

Sanjay Bangar Comments On Virat Kohli Century Drought.. టీమిండియా మెషిన్‌గన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీ సాధించి రెండేళ్లు కావొస్తుంది. 2019లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో కోహ్లి ఆఖరిసారిగా సెంచరీ సాధించాడు. అప్పటినుంచి కోహ్లి ఏ ఫార్మాట్‌లోనూ సెంచరీ చేయలేకపోయాడు. ఆ తర్వాత ఆడిన 13 టెస్టుల్లో 26.04 సగటుతో 599 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు.. మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ స్పందించాడు.  

చదవండి: 21 బంతుల్లోనే సెంచరీ.. టీమిండియా బతికిపోయింది

సచిన్‌, ద్రవిడ్‌ లాంటి దిగ్గజాలు కూడా ఒక దశలో బ్యాడ్‌ఫేజ్‌ అనుభవించారు.  సెంచరీలు చేయలేక జట్టుకు భారంగా మారారు.  వారి ఆటతీరుపై విమర్శలు వచ్చినప్పటికీ బీసీసీఐకి వారిద్దరిపై నమ్మకం ఉంచి అవకాశాలు ఇచ్చింది. అప్పటికే బ్యాటింగ్‌లో వెన్నుముకగా ఉన్న వాళ్లిద్దరు మళ్లీ తిరిగి ఫుంజుకొని సెంచరీలు సాధించారు. ఇప్పుడు కోహ్లి కూడా అదే ఫేజ్‌ను అనుభవిస్తున్నాడు. 

ప్రస్తుతం అన్ని ఫార్మాట్లు కలిపి కోహ్లికి 57 ఇన్నింగ్స్‌లుగా సెంచరీలు లేవు. ఇక టెస్టుల్లో కోహ్లి చివరి సెంచరీ పుణే వేదికగా సౌతాఫ్రికాపై చేశాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి డబుల్‌ సెంచరీ బాదినట్లు బాగా గుర్తు. అప్పటి నుంచి 22 నుంచి 23 ఇన్నింగ్స్‌ల పాటు కోహ్లి నుంచి సెంచరీ రాలేదు.  అయితే బ్యాట్స్‌మన్‌గా కోహ్లి విఫలం కాలేదు. సెంచరీ చేయలేకపోయినప్పటికి మంచి హాఫ్‌ సెంచరీలు సాధించాడు. అతని హాఫ్‌ సెంచరీలు టీమిండియాకు లాభాలే కలిగాయి. 

చదవండి: IND Vs SA: "ద్రవిడ్‌ సర్‌ నుంచి చాలా నేర్చుకున్నా... ఆయనే నా గురువు"

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top