బెయిర్‌స్టో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ | England Won Second ODI Against Ireland | Sakshi
Sakshi News home page

బెయిర్‌స్టో ధనాధన్‌ ఇన్నింగ్స్‌

Aug 3 2020 2:31 AM | Updated on Aug 3 2020 4:21 AM

England Won Second ODI Against Ireland - Sakshi

సౌతాంప్టన్‌: ఆరంభంలో బెయిర్‌స్టో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ (41 బంతుల్లో 82; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు)... చివర్లో స్యామ్‌ బిల్లింగ్స్‌ (61 బంతుల్లో 46 నాటౌట్‌; 6 ఫోర్లు), డేవిడ్‌ విల్లీ (46 బంతుల్లో 47 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత బ్యాటింగ్‌ ఇంగ్లండ్‌కు సిరీస్‌ విజయాన్ని కట్టబెట్టింది. ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది.

తొలుత ఐర్లాండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 212 పరుగులు చేసింది. కర్టిస్‌ క్యాంఫర్‌ (68; 8 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మన్‌ పూర్తిగా విఫలమయ్యారు. అనంతరం ఇంగ్లండ్‌ 32.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసి గెలుపొందింది. ఒక దశలో 131/3తో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్‌... 6 పరుగుల వ్యవధిలో మూడు కీలక వికెట్లను కోల్పోయింది. అయితే బిల్లింగ్స్, విల్లీ అజేయమైన ఏడో వికెట్‌కు 79 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement