ENG vs PAK: పాకిస్తాన్‌తో రెండో టెస్టు.. భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్

ముల్తాన్: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్లకు 202 పరుగులు సాధించింది. బెన్ డకెట్ (79; 6 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (74 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు.
ఓవరాల్ ఆధిక్యాన్ని 281 పరుగులకు పెంచుకుంది .అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 107/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ 202 పరుగులవద్ద ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. వుడ్, రూట్ తలా రెండు వికెట్లు సాధించారు.
వీరితో పాటు పేసర్లు అండర్సన్, రాబిన్సన్ చెరో వికెట్ పడగొట్టారు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజం(75), షకీల్(63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 281 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
చదవండి: IND vs BAN: ఒక్కడి చేతిలో బంగ్లా ఓడింది.. 28 పరుగులు తక్కువ! అదే జరిగితే
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు