ENG VS NZ Test: Ben Stokes May Rule Out Of 3rd Test Due To Illness - Sakshi
Sakshi News home page

Ben Stokes: ఇంగ్లండ్‌కు బిగ్‌ షాక్‌.. కెప్టెన్‌కు అస్వస్థత

Jun 21 2022 9:28 PM | Updated on Jun 22 2022 10:11 AM

ENG VS NZ: Ben Stokes May Rule Out Of 3rd Test Due To Illness - Sakshi

న్యూజిలాండ్‌తో గురువారం (జూన్‌ 23) నుంచి ప్రారంభంకాబోయే మూడో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ అస్వస్థతకు గురైనట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు అధికారులు వెల్లడించారు. జట్టు సభ్యులంతా మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నా.. స్టోక్స్‌ మాత్రం జట్టుకు దూరంగా ఉన్నాడు. అతనికి కోవిడ్‌ టెస్ట్‌ చేయగా నెగటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని ఈసీబీ అధికారులు తెలిపారు. 

స్టోక్స్‌ కివీస్‌తో మూడు టెస్ట్‌తో పాటు టీమిండియాతో జులై 1 నుంచి ప్రారంభంకాబోయే రీషెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉం‍డడని బ్రిటిష్‌ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. స్టోక్స్‌కు డిప్యూటీగా ఈసీబీ ఎవరినీ నియమించకపోవడంతో కివీస్‌తో టెస్ట్‌కు జో రూట్‌ సారధ్యం వహిస్తాడని సమాచారం. 

కాగా, కెప్టెన్‌గా వరుస వైఫల్యాలను ఎదుర్కొన్న జో రూట్‌ ఇటీవలే ఇంగ్లండ్‌ కెప్టెన్సీ పగ్గాలను స్టోక్స్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. స్టోక్స్‌ సారధ్యంలో తొలి సిరీస్‌లోనే ఇంగ్లండ్‌ అద్భుత ఫలితాలను (కివీస్‌పై 2-0తో సిరీస్‌ విజయం) రాబట్టింది. 
చదవండి: అదో భయానక పరిస్థితి.. పాకిస్థాన్‌ లీగ్‌పై ఇంగ్లండ్‌ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement