Dubai Capitals top order thump Abu Dhabi Knight Riders in massive win - Sakshi
Sakshi News home page

ILT20: తీరుమారని నైట్‌ రైడర్స్‌.. వరుసగా ఏడో ఓటమి

Jan 31 2023 3:04 PM | Updated on Jan 31 2023 3:58 PM

Dubai Capitals top order thump Abu Dhabi Knight Riders in massive win - Sakshi

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో అబుదాబి నైట్ రైడర్స్‌ మరో ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అబుదాబి నైట్ రైడర్స్‌ పరాజాయం పాలైంది. ఈ టోర్నీలో నైట్‌ రైడర్స్‌కు ఇది 7వ ఓటమి కావడం గమానార్హం. ఇక 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దుబాయ్ క్యాపిటల్స్‌ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.

దుబాయ్ బ్యాటర్లలో ఓపెనర్‌ మున్సీ 57 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. డిక్వెల్లా(37), షనక (28) పరుగులతో రాణించారు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో కుమార, రస్సెల్‌, అకేల్ హోసేన్ తలా వికెట్‌ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన అబుదాబి నైట్ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.

నైట్ రైడర్స్‌ బ్యాటర్లలో జో క్లార్క్‌ 52 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దుబాయ్ క్యాపిటల్స్‌ బ్యాటర్లలో జంపా మూడు వికెట్లు పడగొట్టగా.. హజ్రత్ లుక్మాన్, ఆకీఫ్‌ రజా తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండిIPL 2023: భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డ ధోని.. వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement