టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్‌ ఎవరంటే..?

Dream11 Set To Become New Jersey Sponsor For Indian Cricket Team - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు జెర్సీ ప్రధాన స్పాన్సర్‌గా ఫాంటసీ స్పోర్ట్స్‌ లీగ్‌ కంపెనీ ‘డ్రీమ్‌11’ ఎంపికవడం దాదాపు ఖాయమైంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఎంత మొత్తానికి అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ కంపెనీ ‘బైజూస్‌’ ఉంది. గత ఏప్రిల్‌తో బైజూస్‌ ఒప్పందం ముగిసింది.

దాంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ల కోసం బిడ్‌లను పిలిచింది. గతంలో ఐపీఎల్‌ టోర్నీ ప్రధాన స్పాన్సర్‌గా కూడా డ్రీమ్‌11 వ్యవహరించింది. అయితే బీసీసీఐతో కొత్త ఒప్పందం ప్రకారం... ఇప్పటివరకు బైజూస్‌ చెల్లించిన మొత్తం (ఒక్కో మ్యాచ్‌కు)కంటే డ్రీమ్‌11 తక్కువగా చెల్లించనున్నట్లు సమాచారం. లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత దీనిపై బోర్డు అధికారిక ప్రకటన చేయనుంది.   
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top