Dinesh Karthik: ఐపీఎల్‌లో అద‌ర‌గొడుతున్నాడు.. భార‌త్ త‌ర‌పున రీ ఎంట్రీ!

Dinesh Karthik likely to get national call up in home series against South Africa Says Reports - Sakshi

ఐపీఎల్‌-2022లో టీమిండియా వెట‌ర‌న్ ఆట‌గాడు, ఆర్సీబీ స్టార్ ఆట‌గాడు దినేష్ కార్తీక్ అద‌ర‌గొడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు మ్యాచ్‌లు ఆడిన కార్తీక్ 209 ప‌రుగులు సాధించాడు. 7వ‌స్థానంలో బ్యాటింగ్ దిగుతున్న కార్తీక్ త‌న సునామీ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీకి బెస్ట్ షినిష‌ర్‌గా మారాడు.  ఇక అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న కార్తీక్ టీమిండియాలో రీఎంట్రీ దాదాపు ఖాయ‌మ‌నిపిస్తోంది.

ఇన్‌సైడ్‌స్పోర్ట్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కార్తీక్ భార‌త జ‌ట్టుకు ఎంపిక‌య్యే అవ‌కాశం ఉంది. "ప్ర‌స్తుతం నిలకడగా ప్రదర్శన చేస్తున్న వారందరికీ బార‌త్ త‌రపున ఆడేందుకు తలుపులు తెరిచే ఉన్నాయి. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు మేము కొన్ని సిరీస్‌లు ఆడ‌నున్నాము.

కార్తీక్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. కచ్చితంగా సెల‌క్ట‌ర్ల దృష్టి ఉంటాడు" అని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ స‌భ్య‌డు ఒక‌రు పేర్కొన్నారు. అయితే, మిడిల్ ఆర్డర్‌లో రిషబ్ పంత్, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్‌ల రూపంలో వెటరన్ వికెట్ కీపర్‌కు గట్టి పోటీ ఎదురు కానుంది. కాగా రిష‌బ్ పంత్ ఫస్ట్‌ ఛాయిస్‌ వికెట్‌ కీపర్‌గా ఉండే అవ‌కాశం ఉంది.

చ‌ద‌వండి: Dhawal Kulkarni: ముంబై జట్టులో టీమిండియా బౌలర్‌.. రోహిత్‌ సిఫార్సుతో చోటు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top