చీఫ్‌ సెలెక్టర్‌ అయి ఉంటే.. అతన్ని తీసుకొచ్చేవాడిని | Dilip Vengsarkar Says If I Chief Selector Brought Back R Ashwin To ODIs | Sakshi
Sakshi News home page

చీఫ్‌ సెలెక్టర్‌ అయి ఉంటే.. అతన్ని తీసుకొచ్చేవాడిని

Mar 28 2021 10:38 AM | Updated on Mar 28 2021 1:07 PM

Dilip Vengsarkar Says If I Chief Selector Brought Back R Ashwin To ODIs - Sakshi

పుణే: ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్యాలు ధారాళంగా పరుగులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌పై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ వస్తున్నాయి. ఆడింది చాలు.. ఇక సెలవు.. అంటూ కామెంట్లు కూడా పెట్టారు. నేడు జరగనున్న మూడో వన్డేకు కుల్దీప్‌ స్థానంలో చహల్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉండగా.. కృనాల్‌ స్థానంలో సుందర్‌ బరిలోకి దిగే చాన్స్‌ ఉంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ దిలీప్ వెంగ్‌సర్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


''ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను తిరగి వన్డే జట్టులోకి తీసుకొస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ' నేను చీఫ్‌ సెలెక్టర్‌ అయి ఉంటే కచ్చితంగా వన్డే జట్టులో​కి అశ్విన్‌ను ఎంపిక చేసేవాడిని. ఇప్పుడున్న పరిస్థితుల్లో వన్డే క్రికెట్‌లో కుల్దీప్‌, చహల్‌ ఎవరిని చూసుకున్న రాణించే స్థితిలో లేరు. కెప్టెన్‌గా కోహ్లి అశ్విన్‌ను వన్డే జట్టులోకి తిరిగి తీసుకోవడం ద్వారా అతని అనుభవం చాలా ఉపయోగపడుతుంది. టెస్టు క్రికెట్‌తో వన్డేకు పోలిక లేకపోవచ్చు.. కానీ పరిమిత ఓవర్లలో అశ్విన్‌ అసవరం ఉన్నట్లు అనిపిస్తుంది. సుందర్‌, అశ్విన్‌ ఇద్దరు ఆఫ్‌ స్పిన్నరేనని.. ఎవరు ఒకరు జట్టులో ఉంటే సరిపోతుందని కోహ్లి ఒక సందర్భంలో చెప్పాడు. కానీ సుందర్‌కు, అశ్విన్‌కు ఏ మాత్రం పోలిక లేదు. ఇద్దరు ఆఫ్‌ స్పిన్నర్లు కావొచ్చు.. కానీ శైలి ఒకేలా ఉండదు.

అనుభవం దృష్యా చూసుకుంటే అశ్విన్‌ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. పరిమిత ఓవర్లలో అశ్విన్‌ పొదుపుగా బౌలింగ్‌ చేస్తూనే వికెట్లు తీయగలడని నా నమ్మకం. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో కృనాల్‌- కుల్దీప్‌లు కలిసి 16 ఓవర్లు వేసి ఒక్క వికెట్‌ కూడా తీయకుండా 156 పరుగులు సమర్పించుకున్నారు. ఇలాగే కొనసాగితే వన్డే జట్టులో స్పిన్నర్లు రావడం కష్టమే. అందుకే అశ్విన్‌ను వన్డేల్లో మరోసారి రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నా'' అంటూ తెలిపాడు. కాగా అశ్విన్‌ టీమిండియా తరపున చివరి వన్డే 2017 జూన్‌లో ఆడాడు. అప్పటి నుంచి టెస్టు క్రికెట్‌కే పరిమితమైన అశ్విన్‌  111 వన్డేల్లో 150 వికెట్లు, 78 టెస్టుల్లో 409 వికెట్లు, 46 టీ20ల్లో 52 వికెట్లు తీశాడు.
చదవండి:
ఐపీఎల్‌ 2021: బీసీసీఐ కీలక నిర్ణయం
హార్దిక్‌కు బౌలింగ్‌ ఇవ్వకపోవడానికి కారణం అదే.. : కోహ్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement