David Warner: వార్నర్‌ సెలబ్రేషన్స్‌; ఏడాది దాటిపోయింది.. ఇంకా వదల్లేదా!

David Warner Brings Out 'Pushpa' Celebration After Australia Stun India - Sakshi

ఆస్ట్రేలియా స్టార్‌ డేవిడ్‌ వార్నర్‌కు భారతీయ సినిమాలంటే అమితమైన ప్రేమ. ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఆ ప్రేమ మరింత ఎక్కువగా ఉంటుంది. పుష్ప సినిమా వచ్చి ఏడాది దాటిపోయినా ఇంకా వార్నర్‌ 'తగ్గేదే లే' అంటూ తిరుగతున్నాడు. ఇప్పట్లో 'పుష్ప' మేనియా వార్నర్‌ను వదిలేలా లేదు. తాజగా టీమిండియాతో వన్డే సిరీస్‌ గెలిచాకా ట్రోఫీ అందుకునే సమయంలో వార్నర్‌ పుష్ప సెలబ్రేషన్స్‌ చేయడం వైరల్‌గా మారింది.

చెన్నై వేదికగా జరిగిన చివరి వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో 2-1తో ఆస్ట్రేలియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో వ‌న్డేలో విక్ట‌రీ త‌ర్వాత ఆసీస్ జ‌ట్టు ట్రోఫీ అందుకున్న స‌మ‌యంలో వార్న‌ర్ త‌న‌దైన స్టైల్‌లో ఎంజాయ్ చేశాడు. పుష్ప చిత్రంలోని 'త‌గ్గేదే లే' అన్న ఫేమ‌స్ డైలాగ్‌తో హీరో అల్లుఅర్జున్‌ ఇచ్చిన ఫోజును వార్న‌ర్ ఇమిటేట్ చేశాడు. ప్లేయ‌ర్ల‌తో గ్రూపు ఫోటో దిగిన స‌మ‌యంలో వార్న‌ర్.. త‌గ్గేదేలే అంటూ హ‌ల్‌చ‌ల్ చేశాడు. ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో కూడా పుష్ప చిత్రంలో అల్లు అర్జున్‌ వాకింగ్‌ స్టైల్‌ను ఇమిటేట్‌ చేయడం కూడా బాగా ఆసక్తి కలిగించింది.

ఆసీస్‌ నిర్దేశించిన 270 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియా 49.1 ఓవర్లలో 248 పరుగులకు పరిమితమైంది. విరాట్‌ కోహ్లీ(54), హార్దిక్‌ పాండ్యా(40) చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచారు. ఆడమ్‌ జంపా(4/45) నాలుగు వికెట్లతో విజృంభించాడు. తొలుత ఆసీస్‌ 49 ఓవర్లలో 269 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్‌(47) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. హార్దిక్‌ పాండ్యా (3/44), కుల్దీప్‌ యాదవ్‌(3/56) మూడేసి వికెట్లు తీశారు. జంపాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, మార్ష్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ దక్కాయి.

చదవండి: పంజాబ్‌ కింగ్స్‌కు ఏకకాలంలో గుడ్‌న్యూస్‌.. బ్యాడ్‌న్యూస్‌

దేశం క్లిష్ట పరిస్థితుల్లో.. వాళ్లకు ప్లాట్లు, ఖరీదైన ఫోన్లు?

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top