
PC: IPL.com
చిన్నస్వామి స్టేడియం వేదికగా సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసిన కోహ్లి.. ఆకాష్ సింగ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.
ఏం జరిగిందంటే?
సీఎస్‌కే సెకెండ్ ఇన్నింగ్స్‌లో తమ ఇంపాక్ట్ ప్లేయర్‌గా పేసర్ ఆకాష్ సింగ్‌ను తీసుకుంది. అయితే తొలి ఓవర్ వేసేందుకు ధోని బంతిని ఆకాష్ సింగ్‌కు అందించాడు. ఈ ఓవర్‌లో రెండో బంతికి ఫోర్ కొట్టి విరాట్ మంచి జోరు మీద కనిపించాడు. ఇదే ఓవర్‌లో ఐదో బంతిని కోహ్లి లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు.
అయితే బంతి బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని కోహ్లి బూట్‌కు తాకి స్టంప్స్‌ను గిరాటేసింది. అలా జరుగుతుందని కోహ్లి అస్సలు ఊహించలేదు. దీంతో నిరాశతో కింగ్ కోహ్లి మైదానాన్ని వీడిడాడు. ఇక కోహ్లి వికెట్ పడగొట్టిన ఆకాష్ సింగ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చెలరేగిన సీఎస్‌కే బ్యాటర్లు..
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్‌కే బ్యాటర్లలో కాన్వే(45 బంతుల్లో 83 పరుగులు), శివమ్ దుబే(52) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, పార్నల్, వైశ్యాఖ్,హర్షల్ పటేల్, హసరంగా, మాక్స్‌వెల్ తలా వికెట్ సాధించారు.
చదవండి: IPL 2023: శివమ్ దుబే విధ్వంసం.. 111 మీటర్ల భారీ సిక్సర్! వీడియో వైరల్
This dismissal. Virat Kohli Is the most unlucky Cricketer. pic.twitter.com/1s0CkIldv9
— Sayam Ahmad (@sayam_ahmad_) April 17, 2023