Cristiano Ronaldo: చరిత్ర సృష్టించిన రొనాల్డో..  

Cristiano Ronaldo Breaks All-Time Mens International Caps Record - Sakshi

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో మరొక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో జట్టును గెలిపించడంలో విఫలమైన రొనాల్డో జర్మనీ వేదికగా జరుగుతున్న యూరోకప్‌ 2024 క్వాలిఫయర్‌లో మాత్రం దుమ్మురేపాడు. గ్రూప్‌-జెలో భాగంగా గురువారం లిచెన్‌స్టెయిన్, పోర్చుగల్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ రొనాల్డోకు 197వది కావడం విశేషం.

ఈ నేపథ్యంలో ఒక దేశం తరపున(పోర్చుగల్‌) తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రొనాల్డో చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు 196 మ్యాచ్‌లతో కువైట్‌కు చెందిన బాదర్ అల్-ముతావాతో సమంగా ఉన్నాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా మొరాకోతో జరిగిన క్వార్టర్స్‌ ఫైనల్‌ రొనాల్డోకు 196వ మ్యాచ్‌.

ఇక మ్యాచ్‌లోనూ రొనాల్డో రెండు గోల్స్‌తో అదరగొట్టాడు. ఆట 51వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన రొనాల్డో ఆట 63వ నిమిషంలో మరో గోల్‌ చేశాడు. దీంతో పోర్చుగల్‌ 4-0 తేడాతో లిచెన్‌స్టెయిన్‌ను చిత్తుగా ఓడించింది. ఇక ఓవరాల్‌గా పోర్చుగల్‌ తరపున 197 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో 120 గోల్స్‌ కొట్టి ఆల్‌టైమ్‌ లీడింగ్‌ గోల్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top