బుమ్రా.. యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో బౌలింగ్‌ చేస్తున్నాడేంటి! | A Clip Of Pacer Replicating Jasprit Bumrahs Bowling Action in European Championship | Sakshi
Sakshi News home page

బుమ్రా.. యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో బౌలింగ్‌ చేస్తున్నాడేంటి!

Sep 29 2021 5:51 PM | Updated on Sep 29 2021 6:17 PM

A Clip Of Pacer Replicating Jasprit Bumrahs Bowling Action in European Championship  - Sakshi

అదింటి బుమ్రా దుబాయ్‌లో ఉన్నాడుగా, యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో బౌలింగ్‌ చేస్తున్నాడేంటి

Jasprit Bumrah’s bowling action in European Championship: ప్రపంచంలోనే అత్యత్తుమ ఫాస్ట్‌ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకడు.  అయితే చాలా మంది బౌలర్లు బుమ్రా బౌలింగ్‌ స్టైల్‌ను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం జరగుతున్న యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో అచ్చెం  బుమ్రా మాదిరిగానే ఒక ఆటగాడు  బౌలింగ్‌ చేస్తున్నాడు. అతని రన్-అప్, బౌలింగ్‌ స్టైల్‌ అచ్చెం బుమ్రాలానే ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియోలొ వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అదింటి బూమ్రా దుబాయ్‌లో ఉన్నాడుగా, యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో బౌలింగ్‌ చేస్తున్నాడేంటి ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ స్పీడ్‌స్టర్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌2021  సెకెండ్‌ ఫేజ్‌లో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా  16 వికెట్లు సాధించి పర్పుల్‌ క్యాప్‌ రేసులో మూడో స్ధానంలో ఉన్నాడు. ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు కీలకమైన వికెట్లు పడగొట్టి ముంబై విజయంలో బుమ్రా  ముఖ్యమైన పాత్ర పోషించాడు.

చదవండి: MI VS PBKS: టీ20ల్లో రికార్డు సృష్టించిన పొలార్డ్‌...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement