Chris Lynn: ఆ బ్యాటర్‌ పని అయిపోందన్నారు.. సెంచరీతో నోరు మూయించాడు

Chris Lynn Smash Century In T20 Blast Tournament Was 3rd T20 Century - Sakshi

ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ లిన్‌ టి20 బ్లాస్ట్‌లో సూపర్‌ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో క్రిస్‌ లిన్‌ నార్తంప్‌టన్‌షైర్‌ తరపున క్రిస్‌ లిన్‌ ఈ సీజన్‌లో అరంగేట్రం చేశాడు. సీజన్‌లో నాలుగో మ్యాచ్‌ ఆడుతున్న లిన్‌.. లీస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో 66 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. క్రిస్‌ లిన్‌ టి20 కెరీర్లో ఇది మూడో సెంచరీ. అతని ధాటికి నార్తంప్‌టన్‌ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ టోర్నీకి ముందు లిన్‌ పని అయిపోయిందని.. అతను రాణించే అవకాశం లేదని విమర్శలు వచ్చాయి. అయితే తనపై వచ్చిన విమర్శలన్నింటికి క్రిస్‌ లిన్‌ తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్తంప్‌టన్‌షైర్‌ 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి వికెట్‌కు మరో ఓపెనర్‌ బెన్‌ కరన్‌(31)తో కలిసి 109 పరుగలు భాగస్వామ్యం నెలకొల్పిన లిన్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత లిన్‌కు జేమ్స్‌ నీషమ్‌ తోడయ్యాడు. ఐపీఎల్‌ నుంచి నేరుగా టి20 బ్లాస్ట్‌లో అడుగుపెట్టిన నీషమ్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనే మెరిశాడు.  30 బంతుల్లోనే 75 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన లీస్టర్‌షైర్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. స్కాట్‌ స్టీల్‌ 64 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: Liam Livingstone: బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top