Anurag Thakur: 2036 ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి భారత్‌ సిద్ధం!

Central Minister Anurag Thakur Says India Considering Bid 2036 Olympics - Sakshi

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉన్నదని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీన్ని సాధించేందుకు ఇండియన్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి రోడ్‌మ్యాప్ ఇస్తామని చెప్పారు. జీ 20 ప్రెసిడెన్సీని భారత్‌ ఇంత పెద్ద స్థాయిలో నిర్వహించగలిగినప్పుడు..ఐఓఏతో కలిపి కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్స్‌ నిర్వహించగలదని భావిస్తున్నట్లు అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. ఒలింపిక్స్‌కు పూర్తిగా సిద్ధమైన తర్వాతనే భారత్‌ బిడ్‌ వేస్తుందని ఆశిస్తున్నామన్నారు. 

భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) క్రీడల నిర్వహణకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని.. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలతో ఆతిథ్య నగరంగా మారుతుందని ఠాకూర్ చెప్పారు. గతంలో 1982 ఆసియా క్రీడలు, 2010 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమైందన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top