Ravindra Jadejas Knee Injury : రవీంద్ర జడేజాపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం..!

BCCI Unhappy Over Ravindra Jadejas Knee Injury says Report - Sakshi

ముంబై: ఆసియా కప్‌ మధ్యలో రవీంద్ర జడేజా అనూహ్యంగా మోకాలి గాయానికి గురై టోర్నీనుంచి తప్పుకున్నాడు. ఇటీవల శస్త్ర చికిత్స కూడా అయింది. అయితే అతను కోలుకొని త్వరలో జరిగే టి20 ప్రపంచకప్‌కు అందుబాటులోకి రావడం సందేహంగా మారింది.

సరదాగా సాహస క్రీడలకు ప్రయత్నించి జడేజా గాయపడ్డాడు. దుబాయ్‌ సముద్ర తీరంలో ‘స్కై బోర్డు’పై విన్యాసాలు చేయబోయిన అతను జారిపడటంతో మోకాలికి గాయమైంది. అయితే ఒక కాంట్రాక్ట్‌ ప్లేయర్‌ ఇలా మైదానం బయట ఆటతో సంబంధం లేని చోట గాయపడటంపై బీసీసీఐ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 
చదవండి: Asia Cup 2022: పాక్‌కు షాకిచ్చిన శ్రీలంక​.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top