టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌లో మార్పులేదు: ఈసీబీ | BCCI Requests ECB For Change in Five-Match Test Series Schedule | Sakshi
Sakshi News home page

టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌లో మార్పులేదు: ఈసీబీ

May 22 2021 6:26 AM | Updated on May 22 2021 6:26 AM

BCCI Requests ECB For Change in Five-Match Test Series Schedule - Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో మిగిలిపోయిన 31 మ్యాచ్‌లను ఇంగ్లండ్‌లో నిర్వహించేందుకుగాను... ఇంగ్లండ్‌–భారత్‌ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి తమకు అధికారికంగా ఎలాంటి విజ్ఞప్తి రాలేదని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) స్పష్టం చేసింది. ‘బీసీసీఐతో పలు అంశాలపై మేము రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాం. కానీ ఐపీఎల్‌ మ్యాచ్‌లను సర్దుబాటు చేసేందుకు ఐదు టెస్టుల సిరీస్‌ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని వారు మమ్మల్ని కోరలేదు. ఇప్పటికైతే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే టెస్టు సిరీస్‌ జరుగుతుంది’ అని ఈసీబీ వర్గాలు తెలిపాయి. భారత్‌–ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు ఆగస్టు 4న మొదలవుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement