ENG Vs IND 2022: ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన భారత్‌.. ధావన్‌కు చోటు..!

BCCI Names Indias squads for ODI and T20I series against England - Sakshi

ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జూలై7న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ చేసిన 5వ టెస్టులో పాల్గొనున్న టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లకు సెలక్టర్లు తొలి టీ20కు విశ్రాంతి ఇచ్చారు.

ఇంగ్లండ్‌తో తొలి టీ20కు ఐర్లాండ్‌తో తలపడిన భారత జట్టునే సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే కొవిడ్‌ కారణంగా ఈ కీలక టెస్టుకు దూరమైన రోహిత్‌ శర్మ తొలి టీ20కు సారథ్యం వహించనున్నాడు. ఇక తొలి సారిగా భారత వన్డే జట్టుకు యువ పేసర్‌ ఆర్షదీప్‌ సింగ్‌ ఎంపికయ్యాడు. అదే విధంగా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కావడంతో ధావన్‌కు జట్టులో చోటు దక్కింది.

తొలి20కి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్సర్ పటేల్, రవి బిష్ణో పటేల్ , భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
రెండు,మూడు టీ20లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్ అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్
వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ చాహల్, అక్షర్‌ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ఆర్షదీప్‌ సింగ్‌
చదవండిENG Vs IND 5th Test: 'ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు.. ఆ ఆల్‌రౌండర్‌ భారత జట్టులో ఉండాల్సింది'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top