టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి కోసం దరఖాస్తుల ఆహ్వానం

BCCI Invites Applications For Team India Head Coach And Other Posts - Sakshi

BCCI Invites Applications For Team India Head Coach Position: భారత పురుషుల క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ పదవి కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్ కోచ్ సహా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ స్థానాలు అలాగే నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ)లో స్పోర్ట్స్‌ సైన్స్‌, మెడిసిన్ హెడ్ ప‌ద‌వుల‌కు కూడా బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. టీమిండియా హెడ్ ​​కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 26 ఆఖరి తేదీ కాగా, ఇత‌ర ప‌ద‌వులకు న‌వంబ‌ర్ 3 చివరి తేదీగా బీసీసీఐ నిర్ణయించింది.

టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ సారథి రాహుల్ ద్ర‌విడ్, బౌలింగ్‌ కోచ్‌గా పరాస్‌ మాంబ్రే పేర్లు దాదాపుగా ఖారారైన నేపథ్యంలో కేవలం ఫార్మాలిటీ కోసం ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటింగ్‌ కోచ్‌గా ప్రస్తుతం ఉన్న విక్రమ్‌ రాథోడ్‌నే కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, టీమిండియా ప్రస్తుత హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి పదవీకాలం నవంబరు 14తో ముగియనున్న సంగతి తెలిసిందే. 
చదవండి: Sania Mirza : భారత్-పాక్‌ మ్యాచ్‌ రోజు ఎవరికీ కనిపించకుండా మాయమైపోతాను..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top