BAN Vs SL 2nd Test Day 5 Highlights: Sri Lanka Beat Bangladesh By 10 Wickets, Win Series - Sakshi
Sakshi News home page

BAN Vs SL 2nd Test: బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఘన విజయం.. 10 వికెట్ల తేడాతో గెలుపొంది!

May 27 2022 3:26 PM | Updated on May 27 2022 4:29 PM

BAN Vs SL 2nd Test: Sri Lanka Beat Bangladesh By 10 Wickets Win Series - Sakshi

WTC 2021-23: బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఘన విజయం.. సిరీస్‌ కైవసం

World Test Championship 2021-23- Bangladesh Vs Sri Lanka Test Series 2022: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఘన విజయం సాధించింది. పది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23లో ఆతిథ్య బంగ్లాను మట్టికరిపించి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను గెలిచి టూర్‌ను గెలుపుతో ముగించింది.

కాగా బంగ్లాదేశ్‌- శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢాకా వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ 365 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇందుకు ధీటుగా బదులిచ్చిన శ్రీలంక 506 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్‌ ముగించింది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను పర్యాటక లంక బౌలర్‌ అసిత ఫెర్నాండో దెబ్బతీశాడు. 17.3 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. ఇతర బౌలర్లలో కసున్‌ రజిత రెండు, మెండిస్‌ ఒక వికెట​ తమ ఖాతాలో వేసుకున్నారు. షాంటోను జయవిక్రమ రనౌట్‌ చేశాడు.

ఈ నేపథ్యంలో 169 పరుగులకే బంగ్లా కుప్పకూలింది. ఇక ఛేదనకు దిగిన లంక 3 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 29 పరుగులు సాధించి 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. అసిత ఫెర్నాండో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్లలో ముష్పికర్‌ రహీమ్‌(175 పరుగులు), లిటన్‌ దాస్‌(141) సెంచరీలు నమోదు చేశారు. లంక ఆటగాళ్లలో మథ్యూస్‌ (145- నాటౌట్‌), చండీమాల్‌(124) శతకాలు సాధించారు.

బంగ్లాదేశ్‌ వర్సె శ్రీలంక స్కోర్లు:
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌- 365 & 169
శ్రీలంక ఇన్నింగ్స్‌-506 & 29/0

చదవండి 👇
IPL 2022 Winner Prediction: క్వాలిఫైయర్‌-2లో గెలుపు వారిదే.. టైటిల్‌ కొట్టేదీ వాళ్లే: హర్భజన్‌ సింగ్‌
Qualifier 2 RR Vs RCB: సమఉజ్జీలు.. పంతం నీదా- నాదా సై.. అహ్మదాబాద్‌లో టాస్‌ గెలిస్తే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement