Ban vs Ind 1st ODI: Bangladesh opt to bowl, Kuldeep Sen makes India debut - Sakshi
Sakshi News home page

IND vs BAN 1st ODI: బంగ్లాదేశ్‌తో తొలి వన్డే.. యువ బౌలర్‌ ఎంట్రీ! పంత్‌ దూరం

Dec 4 2022 11:11 AM | Updated on Dec 4 2022 11:45 AM

BAN vs IND: Ban won the toss elected bowl First - Sakshi

బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా తొలి వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇక మ్యాచ్‌లో భారత తరపున యువ పేసర్‌ కుల్దీప్ సేన్‌ అరంగేట్రం చేయనున్నాడు.

ఇక వరుసగా విఫలమవుతున్న భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఇద్దరు స్పిన్నర్లు, నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది.

తుది జట్లు
భారత్‌
రోహిత్ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్

బంగ్లాదేశ్‌
లిట్టన్ దాస్(కెప్టెన్‌), అనముల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌ కీపర్‌), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రెహమాన్‌
చదవండి: T10 League: ఎలిమినేటర్‌ మ్యాచ్‌.. గల్లీ క్రికెట్‌లా ఈ ఆటలేంటి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement