పీఎస్‌ఎల్‌లో బాల్‌ టాంపరింగ్‌ వివాదం! | Ball Tampering Scandal In PSL 2026 Lahore Vs Karachi Match | Sakshi
Sakshi News home page

పీఎస్‌ఎల్‌లో బాల్‌ టాంపరింగ్‌ వివాదం!

Mar 30 2026 9:33 AM | Updated on Mar 30 2026 11:11 AM

Ball Tampering Scandal In PSL 2026 Lahore Vs Karachi Match

ఐపీఎల్‌కు పోటీగా ప్రారంభ‌మైన పాకిస్థాన్ సూప‌ర్ లీగ్  (పీఎస్ఎల్ 2026)లో తొలి రోజునే తెల్ల‌బంతి కాస్తా గులాబీ రంగులోకి మారిపోవ‌డం వివాదానికి దారి తీసింది. దీనిపై చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే తాజాగా బాల్ టాంప‌రింగ్ వివాదం పీఎస్ఎల్‌లో క‌ల‌క‌లం రేపుతోంది.  ఆదివారం లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బాల్ టాంప‌రింగ్ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. 

ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో, లాహోర్ ఖ‌లంద‌ర్స్ బంతిని ట్యాంప‌రింగ్ చేసిన‌ట్లు అంపైర్లు అనుమానించారు. దీని ఫలితంగా ఐదు పరుగుల పెనాల్టీ విధించబడింది. క‌రాచీ ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్‌ను హారిస్ రవూఫ్ వేయడానికి సిద్ధమవుతున్న సమయంలో అంపైర్ ఫైసల్ అఫ్రిది బంతిని పరిశీలించారు. 

ఈ నేప‌థ్యంలో బంతి ఆకారం ఉద్దేశపూర్వకంగా మార్పు చెందిందని నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన అంపైర్ లాహోర్ జ‌ట్టుకు ఐదు ప‌రుగుల పెనాల్టీ విధించారు. దీంతో ల‌క్ష్యం ఒక్క‌సారిగా 14 ప‌రుగుల నుంచి 9 ప‌రుగుల‌కు త‌గ్గింది. దీనిపై లాహోర్ కెప్టెన్ ష‌హీన్ అఫ్రిది మైదానంలో అసహనం వ్యక్తం చేశాడు. 

అయితే మ్యాచ్ అనంతరం అఫ్రిది స్పందిస్తూ.. ‘అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కెమెరా ఫుటేజీని చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. ఐదు పరుగులు పెనాల్టీ విధించారు, ఇప్పుడు మేము చేయగలిగేది ఏమీ లేదు’ అని అఫ్రిది పేర్కొన్నాడు. దీంతో ఇప్పటికే వివాదాల నడుమ మొదలైన పీఎస్‌ఎల్‌లో బాలా టాంపరింగ్ అంశంతో మరింత రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఇక మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం కరాచీ కింగ్స్ 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ముహమ్మద్ వసీమ్ (38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

చదవండి: IPL 2026: ముగ్గురు మొనగాళ్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement