Karachi Kings
-
అందుకే IPL కాదని.. PSLలో ఆడుతున్నా: మొయిన్ అలీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అమ్ముడుపోని విదేశీ క్రికెటర్లలో చాలా మంది పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో చేరతారు. ఒకవేళ మళ్లీ ఐపీఎల్ నుంచి గనుక ఆఫర్ వస్తే భారత్‌కు వచ్చేస్తారు. తాజా ఎడిషన్‌లో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీ, శ్రీలంక కెప్టెన్ దసున్ షనక, ఆస్ట్రేలియా స్టార్ స్పెన్సర్ పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో చేరారు.నాకిప్పుడు 38 ఏళ్లుఅయితే, తాను మాత్రం ఈ కోవకు చెందినవాడిని కాదంటున్నాడు ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ మొయిన్ అలీ (Moeen Ali). తాను కావాలనే IPLను కాదని PSLను ఎంచుకున్నట్లు తెలిపాడు. ‘‘నాకిప్పుడు 38 ఏళ్లు. అయినప్పటికీ నేనింకా క్రికెట్ ఆడాలనే అనుకుంటున్నాను. వీలైనంతగా నా కెరీర్‌ను పొడిగించుకోవాలని భావిస్తున్నాను.షార్ట్‌టైమ్ టోర్నీకరాచీ కింగ్స్‌లో నాకు ఈ స్వేచ్ఛ దొరికింది. ముఖ్యంగా పీఎస్ఎల్ తక్కువ వ్యవధిలోనే ముగిసిపోయే టోర్నీ. కాబట్టి ఆటగాడిగా నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూనే కుటుంబానికి తగిన సమయం కేటాయించే వీలు దొరుకుతుంది.గతేడాది నేను ఐపీఎల్లో ఆడాను. అయితే సగం మ్యాచ్‌లలో కూడా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బహుశా రెండుసార్లు నేను బ్యాటింగ్ చేసి ఉంటాను. నిజానికి నాకు బ్యాటింగ్ చేయడం ఇష్టం. నా కెరీర్ చరమాంకంలోనూ ఎక్కువగా బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నా.అయితే, ఏ జట్టులోనైనా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటుకు గ్యారెంటీ ఉండదు. పీఎస్ఎల్లో కూడా అంతే. అయితే, ఆటను వీలైనంతగా ఆస్వాదించాలని భావిస్తున్నా. ఒక్కసారైనా పీఎస్ఎల్ ఆడాలని అనుకున్నా.షెడ్యూల్ క్లాష్ కానీ.. దురదృష్టవశాత్తూ ఐపీఎల్‌తో పీఎస్ఎల్ షెడ్యూల్ క్లాష్ అవుతోంది. అందుకే ఈ సారి ఐపీఎల్‌కు దూరమయ్యాను’’ అని మొయిన్ అలీ తన నిర్ణయానికి గల కారణాలు వెల్లడించాడు.కాగా ఐపీఎల్- 2025 మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీని రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఈ ఏడాది పీఎస్ఎల్లో కరాచీకి ఆడుతున్న అతడు రూ. 2 కోట్లకు పైగా జీతం అందుకుంటున్నాడు. కాగా ఈ సీజన్లో అతడు ఇప్పటికి 126 పరుగులు చేసి.. మూడు వికెట్లు తీయగలిగాడు. ఇక 2024లో మొయిన్ అలీ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్.. వార్నర్ పరిస్థితి ఇదీ!
స్వల్ప విరామంలో స్వదేశానికి వెళ్లి, అనూహ్య పరిణామాల మధ్య డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టైన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్.. రీఎంట్రీలో తొలి మ్యాచ్‌లోనే దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్‌గానూ చేతులెత్తేసి తన జట్టు ఘోర పరాజయానికి కారకుడయ్యాడు.నిన్న (ఏప్రిల్ 9) పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ తొలి బంతికే గోల్డెన్ డకౌటై నిరాశపరిచాడు. అతని జట్టు 247 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసి 87 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 159 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో బెయిల్‌పై విడుదలై పాకిస్తాన్‌కు వచ్చిన వార్నర్ ఇంకా ఆ తాలూకా బాధలోనే ఉన్నట్లు స్పష్టంగా తెలిసింది. అతనిలో పూర్వపు జోష్ కనిపించలేదు. ఈ సీజన్లో కరాచీ కింగ్స్‌కు ఇదే తొలి ఓటమి. వ్యక్తిగతంగానూ డ్రింక్ అండ్ డ్రైవ్ ఘటనకు ముందు వార్నర్ ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నాడు. 3 మ్యాచ్‌ల్లో ఓ హాఫ్ సెంచరీ, ఓ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు.అయితే డి అండ్ డి కేసులో అరెస్ట్ తర్వాత వార్నర్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి పాక్షిక ఉపశమనం పొందినప్పటికీ.. మే 7న సిడ్నీ కోర్టులో హాజరుకావాల్సి ఉంది. కొద్ది రోజుల కిందట వ్యక్తిగత పనుల నిమిత్తం స్వదేశానికి వెళ్లిన వార్నర్ డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో న్యూ సౌత్ వేల్స్ పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.104గా నమోదైంది. ఇది ఆస్ట్రేలియాలో చట్టబద్ధ పరిమితి కంటే రెండింతలు ఎక్కువ. దీంతో పోలీసులు వార్నర్‌ను వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆతర్వాత కేసు నమోదు చేశారు. వార్నర్ అరెస్ట్‌పై క్రికెట్ సమాజంలో చాలా విమర్శలు వచ్చాయి. తాజాగా ఇంగ్లండ్ మాజీ బౌలర్ డొమినిక్ కార్క్ వార్నర్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. జట్టు విజయవంతంగా ఉన్నప్పుడు ఆటగాళ్లకు సెలవులు ఇవ్వకూడదని అన్నాడు. ఇది జట్టు మోమెంటమ్‌ను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డాడు. -
డేవిడ్ వార్నర్ అరెస్ట్.. ఆ జట్టుకు కొత్త కెప్టెన్?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో వరుస విజయాలతో దూసుకు పోతున్న కరాచీ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీలో భాగంగా కరాచీ కింగ్స్ గురువారం పెషావర్ జల్మీతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు కరాచీ రెగ్యులర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.డేవిడ్ వార్నర్ సిడ్నీలో మధ్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో అతడిపై పోలీసులు డ్రండ్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. అయితే అతడు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి వార్నర్ ఏప్రిల్ 7న కరాచీ కింగ్స్ జట్టుతో తిరిగి చేరాల్సింది.కానీ అతడు ఇంకా పాకిస్తాన్‌కు రానిట్లు తెలుస్తోంది. ఈరోజు పెషావర్ జల్మీతో జరగనున్న కీలక మ్యాచ్‌కు వార్నర్ అందుబాటులో లేకపోవడంతో, కరాచీ కింగ్స్ తాత్కాలిక కెప్టెన్‌గా పేసర్ హసన్ అలీ వ్యవహరించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.అసలేమి జరిగిందంటే?కరాచీ కింగ్స్ జట్టుకు వారం రోజులు విశ్రాంతి లభించడంతో వార్నర్ తన కుటుంబంతో సమయం గడపడానికి పాక్ నుండి ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఈ క్రమంలో సిడ్నీలోని మారుబ్రా ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్‌లో వార్నర్ దొరికిపోయాడు.వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి నిర్ణీత పరిమితి కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాతి అతడిని విడిచిపెట్టారు. అయితే వచ్చే నెలలో ఈ కేసుకు సంబంధించి వార్నర్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కాగా పెషావర్ జల్మీతో మ్యాచ్‌కు దూరంగా ఉన్నప్పటికి కరాచీ ఆడే తదుపరి మ్యాచ్‌కు వార్నర్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.చదవండి: IPL 2026: 'ఎంత మంది వచ్చినా అతడే నా ఫేవరేట్ కెప్టెన్' -
ఉన్నపళంగా పాక్ నుంచి వెళ్లిపోయిన డేవిడ్ వార్నర్?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అతడి సారథ్యంలోని కరాచీ కింగ్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. కరాచీ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లోనూ విజయం సాధించి టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.అయితే రావల్పిండిజ్‌తో గురువారం జరిగిన మ్యాచ్ అనంతరం వార్నర్, ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదో విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో బహిరంగంగానే అలీపై గట్టిగా కేకలు వేస్తూ డేవిడ్ భాయ్ కన్పించాడు. కరాచీ టీమ్ డైరెక్టర్ హైదర్ అజర్ జోక్యంతో గొడవ సద్దమణుగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. షేక్ హ్యాండ్స్ విషయంలో గొడవ తలెత్తినట్లు సమాచారం. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇది కేవలం టీమ్ బాంటర్ మాత్రమే అని వార్నర్ స్పష్టం చేశాడు.ఆస్ట్రేలియాకు వెళ్లిపోయిన డేవిడ్ భాయ్?ఇక ఇది ఇలా ఉండగా.. డేవిడ్ వార్నర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరాచీ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 9న పెషావర్‌తో తలపడనుంది. అయితే దాదాపు వారం రోజుల విశ్రాంతి లభించడంతో వార్నర్ తన స్వదేశానికి వెళ్లిపోయినట్లు సమాచారం.అతడు తిరిగి మ్యాచ్‌కు ముందు జట్టుతో కలవనున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా సోషల్ మీడియాలో మాత్రం వార్నర్ కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీపై అలిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై కరాచీ కింగ్స్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.చదవండి: IPL 2026: ఆర్సీబీ, సన్‌రైజర్స్ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే! -
మొయిన్ అలీతో డేవిడ్ వార్నర్ గొడవ?
ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. ‘‘మీ నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదు భాయ్’’ అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..హాఫ్ సెంచరీడేవిడ్ వార్నర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)తో బిజీగా ఉన్నాడు. కరాచీ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రావల్పిండిజ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ధనాధన్ దంచికొట్టాడు. ఓపెనర్‌గా వచ్చిన వార్నర్ 36 బంతుల్లో 50 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అతడికి తోడు ఆజం ఖాన్ (34 బంతుల్లో 74) రాణించడంతో కరాచీ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.మొయిన్ అలీతో గొడవ?ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం డేవిడ్ వార్నర్ సహచర ఆటగాడు మొయిన్ అలీతో సీరియస్‌గా ఏదో అన్నట్లు కనిపించింది. ఇంతలో కరాచీ టీమ్ డైరెక్టర్ హైదర్ అజర్ వచ్చాడు. వార్నర్ భుజంపై చెయ్యి వేసి సముదాయించే ప్రయత్నం చేసినట్లు కనిపించగా.. అతడి చేయిని తీసేసిన వార్నర్ పక్కకు వెళ్లమని సైగ చేశాడు.క్లారిటీ ఇచ్చిన వార్నర్ఆ తర్వాత మరోసారి హైదర్ వార్నర్ భుజాలపై చేయి వేసి నడిపించగా.. అటూ ఇటూ చూపిస్తూ వార్నర్ అతడికి ఏదో వివరించే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. వార్నర్ తాజాగా స్పందించాడు. ‘‘ముందు వెళ్లి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేయమని నేను హైదర్‌కు చెప్పాను’’ అని వార్నర్ స్పష్టం చేశాడు. తాను సరదాగా చేసిన పనిని అపార్థం చేసుకున్నారని పేర్కొన్నాడు.మరోవైపు.. హైదర్ అజర్ ఈ వైరల్ దృశ్యాలపై స్పందిస్తూ.. ‘‘ఇందులో నిజం లేదు. వాళ్లిద్దరు (వార్నర్, అలీ) నాతో మజాక్ చేస్తున్నారు అంతే’’ అని పేర్కొన్నాడు. ఏదేమైనా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత వీరు వివరణ ఇవ్వడం గమనార్హం.చదవండి: ముస్తాఫిజుర్ రహమాన్ తొలగింపు దురదృష్టకరం: ఐపీఎల్ చైర్మన్I said to @HaiderAzhar to go first and shake hands 🤣🤣🤣 https://t.co/tiTbSjZIyG— David Warner (@davidwarner31) April 2, 2026 -
పీఎస్ఎల్లో బాల్ టాంపరింగ్ వివాదం!
ఐపీఎల్‌కు పోటీగా ప్రారంభమైన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ 2026)లో తొలి రోజునే తెల్లబంతి కాస్తా గులాబీ రంగులోకి మారిపోవడం వివాదానికి దారి తీసింది. దీనిపై చర్చ జరుగుతుండగానే తాజాగా బాల్ టాంపరింగ్ వివాదం పీఎస్ఎల్లో కలకలం రేపుతోంది. ఆదివారం లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో, లాహోర్ ఖలందర్స్ బంతిని ట్యాంపరింగ్ చేసినట్లు అంపైర్లు అనుమానించారు. దీని ఫలితంగా ఐదు పరుగుల పెనాల్టీ విధించబడింది. కరాచీ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను హారిస్ రవూఫ్ వేయడానికి సిద్ధమవుతున్న సమయంలో అంపైర్ ఫైసల్ అఫ్రిది బంతిని పరిశీలించారు. ఈ నేపథ్యంలో బంతి ఆకారం ఉద్దేశపూర్వకంగా మార్పు చెందిందని నిర్ధారణకు వచ్చిన అంపైర్ లాహోర్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో లక్ష్యం ఒక్కసారిగా 14 పరుగుల నుంచి 9 పరుగులకు తగ్గింది. దీనిపై లాహోర్ కెప్టెన్ షహీన్ అఫ్రిది మైదానంలో అసహనం వ్యక్తం చేశాడు. అయితే మ్యాచ్ అనంతరం అఫ్రిది స్పందిస్తూ.. ‘అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కెమెరా ఫుటేజీని చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. ఐదు పరుగులు పెనాల్టీ విధించారు, ఇప్పుడు మేము చేయగలిగేది ఏమీ లేదు’ అని అఫ్రిది పేర్కొన్నాడు. దీంతో ఇప్పటికే వివాదాల నడుమ మొదలైన పీఎస్ఎల్లో బాలా టాంపరింగ్ అంశంతో మరింత రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం కరాచీ కింగ్స్ 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ముహమ్మద్ వసీమ్ (38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.This is so Shameful pic.twitter.com/DqTWMk1Mbg— Ehtisham Siddique (@iMShami_) March 29, 2026చదవండి: IPL 2026: ముగ్గురు మొనగాళ్లు!


