ఉన్నపళంగా పాక్‌ నుంచి వెళ్లిపోయిన డేవిడ్‌ వార్నర్‌? | David Warner Leaves PSL Midway After Moeen Ali Controversy | Sakshi
Sakshi News home page

PSL 2026: ఉన్నపళంగా పాక్‌ నుంచి వెళ్లిపోయిన డేవిడ్‌ వార్నర్‌?

Apr 3 2026 4:13 PM | Updated on Apr 3 2026 5:52 PM

David Warner Leaves PSL Midway After Moeen Ali Controversy

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌-2026లో క‌రాచీ కింగ్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా దిగ్గ‌జం డేవిడ్ వార్న‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అత‌డి సార‌థ్యంలోని కరాచీ కింగ్స్ జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. కరాచీ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన మూడు మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించి టేబుల్ టాప‌ర్‌గా కొన‌సాగుతోంది.

అయితే రావల్పిండిజ్‌తో గురువారం జరిగిన మ్యాచ్ అనంత‌రం వార్న‌ర్‌,  ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీ మ‌ధ్య తీవ్ర‌ వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదో విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. దీంతో బ‌హిరంగంగానే అలీపై గ‌ట్టిగా కేక‌లు వేస్తూ డేవిడ్ భాయ్ క‌న్పించాడు.

 కరాచీ టీమ్‌ డైరెక్టర్‌ హైదర్‌ అజర్ జోక్యంతో గొడ‌వ స‌ద్ద‌మణుగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. షేక్ హ్యాండ్స్ విష‌యంలో గొడ‌వ తలెత్తిన‌ట్లు స‌మాచారం. అయితే త‌మ మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని, ఇది కేవ‌లం టీమ్ బాంటర్ మాత్రమే అని వార్న‌ర్ స్ప‌ష్టం చేశాడు.

ఆస్ట్రేలియాకు వెళ్లిపోయిన డేవిడ్‌ భాయ్‌?
ఇక ఇది ఇలా ఉండ‌గా.. డేవిడ్ వార్న‌ర్ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. క‌రాచీ కింగ్స్ త‌మ తదుప‌రి మ్యాచ్‌లో ఏప్రిల్ 9న పెషావ‌ర్‌తో త‌ల‌ప‌డ‌నుంది. అయితే దాదాపు వారం రోజుల విశ్రాంతి ల‌భించడంతో వార్న‌ర్ త‌న స్వ‌దేశానికి వెళ్లిపోయిన‌ట్లు స‌మాచారం.

అత‌డు తిరిగి మ్యాచ్‌కు ముందు జ‌ట్టుతో క‌ల‌వ‌నున్న‌ట్లు పాక్ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. కాగా సోషల్‌ మీడియాలో మాత్రం  వార్నర్‌ కరాచీ కింగ్స్‌ ఫ్రాంచైజీపై అలిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై కరాచీ కింగ్స్‌ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
చదవండి: IPL 2026: ఆర్సీబీ, స‌న్‌రైజ‌ర్స్ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవే!

Advertisement
 
Advertisement
Advertisement