డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో అరెస్ట్‌.. వార్నర్‌ పరిస్థితి ఇదీ! | PSL 2026: David Warner out for golden duck after drunk and drive arrest | Sakshi
Sakshi News home page

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో అరెస్ట్‌.. ప్రస్తుతం వార్నర్‌ పరిస్థితి ఇది..!

Apr 10 2026 1:50 PM | Updated on Apr 10 2026 3:19 PM

PSL 2026: David Warner out for golden duck after drunk and drive arrest

స్వల్ప విరామంలో స్వదేశానికి వెళ్లి, అనూహ్య పరిణామాల మధ్య డ్రింక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో అరెస్టైన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో కరాచీ కింగ్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్‌.. రీఎంట్రీలో తొలి మ్యాచ్‌లోనే దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్‌గానూ చేతులెత్తేసి తన జట్టు ఘోర పరాజయానికి కారకుడయ్యాడు.

నిన్న (ఏప్రిల్‌ 9) పెషావర్‌ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ తొలి బంతికే గోల్డెన్‌ డకౌటై నిరాశపరిచాడు. అతని జట్టు 247 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసి 87 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 159 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.

డ్రింక్‌ అండ్ డ్రైవ్‌ కేసులో బెయిల్‌పై విడుదలై పాకిస్తాన్‌కు వచ్చిన వార్నర్‌ ఇంకా ఆ తాలూకా బాధలోనే ఉన్నట్లు స్పష్టంగా తెలిసింది. అతనిలో పూర్వపు జోష్‌ కనిపించలేదు. 

ఈ సీజన్‌లో కరాచీ కింగ్స్‌కు ఇదే తొలి ఓటమి. వ్యక్తిగతంగానూ డ్రింక్‌ అండ్‌ డ్రైవ్‌ ఘటనకు ముందు వార్నర్‌ ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నాడు. 3 మ్యాచ్‌ల్లో ఓ హాఫ్‌ సెంచరీ, ఓ కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు.

అయితే డి అండ్‌ డి కేసులో అరెస్ట్‌ తర్వాత వార్నర్‌ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి పాక్షిక ఉపశమనం పొందినప్పటికీ.. మే 7న సిడ్నీ కోర్టులో హాజరుకావాల్సి ఉంది. 

కొద్ది రోజుల కిందట వ్యక్తిగత పనుల నిమిత్తం స్వదేశానికి వెళ్లిన వార్నర్‌ డ్రింక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో న్యూ సౌత్‌ వేల్స్‌ పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో వార్నర్‌ రక్తంలో ఆల్కహాల్‌ స్థాయి 0.104గా నమోదైంది. ఇది ఆస్ట్రేలియాలో చట్టబద్ధ పరిమితి కంటే రెండింతలు ఎక్కువ. దీంతో పోలీసులు వార్నర్‌ను వెంటనే అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆతర్వాత కేసు నమోదు చేశారు.  

వార్నర్‌ అరెస్ట్‌పై క్రికెట్‌ సమాజంలో చాలా విమర్శలు వచ్చాయి. తాజాగా ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ డొమినిక్‌ కార్క్‌ వార్నర్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. జట్టు విజయవంతంగా ఉన్నప్పుడు ఆటగాళ్లకు సెలవులు ఇ‍వ్వకూడదని అన్నాడు. ఇది జట్టు మోమెంటమ్‌ను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డాడు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement