breaking news
Drink and drive case
-
మందు కొట్టి.. ఫ్యామిలీని బలిపెట్టాడు
జిన్నారం (పటాన్చెరు): మద్యంమత్తులో డ్రైవింగ్ ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఓ వ్యక్తి తాగి బైక్ నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన భార్యకూతురు ప్రాణాలు కోల్పోయారు. అతడితోపాటు కుమారుడు తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. జిన్నారం మండలం గుమ్మడిదల గ్రామానికి చెందిన కమ్మరి బ్రహ్మచారి, కల్పన(25)దంపతులకు లాస్య, కృతిక, కార్తీక్ సంతానం. బ్రహ్మచారి దినసరి కూలి. బొల్లారంలోని బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆదివారం సాయంత్రం ఐదుగంటల సమయంలో బ్రహ్మచారితోపాటు భార్య కల్పన, కుమారుడు కార్తీక్(3), కూతురు కృతిక బైక్‌పై బయలుదేరారు. అప్పటికే తాగి ఉన్నాడు. గుమ్మడిదల నుంచి దోమడుగు మీదుగా వెళ్తుండగా బైక్ కిందపడటంతో కల్పన, చిన్నారులకు గాయాలయ్యాయి. దీంతో సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుని అదే బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. దోమడుగు సమీపంలోని ప్రధాన మూలమలుపు వద్ద వేగంగా వెళ్తూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. కల్పనతోపాటు చిన్నారి కృతిక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను పటాన్‌చెరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బ్రహ్మచారి, కార్తీక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్తీక్ పరిస్థితి విషమంగా ఉంది. -
జోష్‌లో జాగ్రత్త
* ఏటా పెరుగుతున్న ‘డ్రింక్ అండ్ డ్రైవ్’ కేసుల సంఖ్య * తాగినడిపిన వారితో పాటు అమాయకుల ప్రాణాలు బలి * ‘న్యూ ఇయర్ పార్టీ’లో డ్రింక్ అండ్ డ్రైవ్‌కి కాస్తంత దూరంగా * ఉండాలంటున్న పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సాక్షి, బెంగళూరు : న్యూ ఇయర్‌ను సరికొత్త జోష్‌తో స్వాగతించేందుకు ఉద్యాననగరి వాసులు సన్నద్ధమవుతున్నారు. మరి ఈ జోష్‌లో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా ఉండాలంటే మాత్రం ‘డ్రింక్ అండ్ డ్రైవ్’కి దూరంగా ఉండమని సూచిస్తున్నారు పోలీసు అధికారులు. మద్యం మత్తులో వాహనాలను నడుపడం వల్ల రాష్ట్రంతో పాటు నగరంలో కూడా ప్రతి రోజూ ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. బాధ్యతారాహిత్యంగా తాగి వాహనాలను నడపడం వల్ల వారి కుటుంబాలతో పాటు అమాయకులైన మరికొంత మంది ప్రాణాలను సైతం హరించి వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. అందుకే ఈ కొత్త ఏడాది సంబరాల్లో ఎలాంటి అపశ్రుతి చోటుచేసుకోకుండా ఉండేందుకు గాను ఁడ్రింక్ అండ్ డ్రైవ్*కి తప్పని సరిగా దూరంగా ఉండమని పోలీసు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజలను కోరుతున్నారు. ఏడాది కేడాదికి పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య... డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా చోటు చేసుకుంటున్న ప్రమాదాల సంఖ్య రాష్ట్రంలో ఏడాదికేడాదికి పెరుగుతోంది. ఈ తరహా సంఘటనల్లోను ద్విచక్రవాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమైన సంఘటనలే ఎక్కువని కూడా ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తుంది. 2010లో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య 76,232, కాగా అందులో ద్విచక్రవాహన దారుల సంఖ్య 46,156, ఇక 2011లో నమోదైన కేసుల సంఖ్య 76,833కాగా ద్విచక్రవాహన దారుల సంఖ్య 47,006, ఇక 2012లో మొత్తం 78,371కేసులు నమోదు కాగా వాటిలో 51,998 కేసులు ద్విచక్ర వాహనాలపై నమోదైనవే. ఇలా ఏడాదికేడాది డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరుగుతున్న ప్రమాదాల సంఖ్య రాష్ట్రంలో పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్యా పెరుగుతోంది రాష్ట్రంలో ఏడాదికేడాదికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య మాత్రమే కాదు డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరిగిన ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. 2010లో రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 20గా నమోదుకాగా, 2011కు అది 22కు పెరిగింది. ఇక 2012 నాటికి ఈ సంఖ్య 28కి చేరుకుం దని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే అనేక సందర్భాల్లో ప్రమాద సమయంలో తీవ్రంగా గాయపడి, కొన్ని రోజుల తర్వాత మరణించిన వారి సంఖ్యను ప్రభుత్వం లెక్కించదు కాబట్టి ప్రభుత్వ గణాంకాల కన్నా మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చనేది విశ్లేషకుల వాదన. ఇలా చేయవచ్చుగా... - డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాలను నిరోధించడానికి నిపుణులు కొన్ని సూచనలను ఇస్తున్నారు. వాటిని ఒకసారి పరిశీలిస్తే... - ఈ న్యూయర్ పార్టీ వేడుకలో స్నేహితుల బృందంతో పార్టీల్లో పాల్గొంటే స్నేహితుల బృందంలో ఎవరో ఒకరు మద్యానికి దూరంగా ఉండి మిగతా వారిని క్షేమంగా ఇంటికి చేర్చవచ్చు. - మద్యం సేవించిన సమయంలో సెల్ఫ్ డ్రైవింగ్‌కు బై బై చెప్పి ఏ ఆటోలోనో, క్యాబ్‌లోనో ఇంటికి చేరితే ప్రమాదాలను నివారించవచ్చు.